భోపాల్‌లో దారుణం: దివ్యాంగులపై అత్యాచారం చేసిన హాస్టల్ ఓనర్

Recommended Video

    దారుణం..దివ్యాంగులపై అత్యాచారం చేసిన హాస్టల్ ఓనర్

    భోపాల్ : బీహార్ ముజఫర్‌నగర్‌లోని అనాథాశ్రమంలో పిల్లలపై అత్యాచార ఘటన మరువకముందే మరో ఘటన మరో ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ప్రైవేట్ హాస్టల్ నడిపే నిర్వాహకుడు అక్కడి ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు అబ్బాయిలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. హాస్టల్ ఓనర్ తమపై అత్యాచారం చేశాడని ఆ హాస్టల్‌లో ఉంటున్న చెవిటి అంధ విద్యార్థులు చెప్పారు. అంతేకాదు అసహజరీతిలో తమను లైంగికంగా వేధించారని వారు ఆరోపించారు. దీనిపై మధ్యప్రదేశ్ విపక్ష కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై గతంలోనే ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని ఆరోపించింది.

    భోపాల్‌లోని భైరాఘర్ ప్రాంతంలో ఈ హాస్టల్ ఉంది. మరో బ్రాంచి హోషంగాబాద్‌ జిల్లాలో ఉంది. భైరాఘర్ బ్రాంచిలో ఉంటున్న వారు తమ డైరెక్టర్ వారిపై అత్యాచారం చేసినట్లు గతేడాది అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని చెప్పారు. హాస్టల్‌లో ఉంటున్న 40మంది స్నేహితులు కాంగ్రెస్ ఆఫీస్‌కెళ్లి అక్కడ తమపై జరిగిన దారుణం గురించి వివరించారు.దీంతో పార్టీ రాష్ట్ర మీడియా సెల్ ఛీఫ్ శోభ ఓజా ప్రెస్ మీట్ పెట్టారు.

    Differently abled inmates raped, police have not filed the complaint

    ఫిబ్రవరి 2017లో బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆమె అన్నారు. ఫిర్యాదు చేశారని తెలియగానే హోషంగాబాద్ బ్రాంచ్‌ను మూసివేశారు. అనంతరం మరో దివ్యాంగురాలైన అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలపై డైరెక్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని శోభ తెలిపారు. బాధితులు సామాజికన్యాయ శాఖ వద్ద ఫిర్యాదు చేశారు. అనంతరం టీటీనగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అక్కడ కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తమకు అందిందని విచారణ ప్రారంభించినట్లు డీఐజీ ధర్మేంద్ర చౌదరి తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+