వేరే దేశం ఆశ్రయమిస్తే భారత్‌లో ఉండను: అజంఖాన్, అందుకే

లక్నో: వివాదాస్పద ఉత్తర ప్రదేశ్ మంత్రి, సమాజ్ వాది పార్టీ నేత అజమ్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు మరే దేశమైన ఆశ్రయం కల్పిస్తే తాను భారత దేశాన్ని వీడేందుకు సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించాడు. అజమ్ ఖాన్ ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్య చేస్తూనే ఉంటాడు!

తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తనకు మరే దేశమైన ఆశ్రయం (షెల్టర్) ఇస్తే తాను హిందూస్తాన్‌ను వదిలేందుకు సిద్ధంగా ఉన్నానని, తనతో పాటు తన కుటుంబం కూడా భారత్‌ను వదిలేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు.

నా వల్ల దేశం ఎందుకు బాధపడాలన్నారు. ప్రస్తుతం ముస్లీంలకు దేశంలో ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అజం ఖాన్ ఒత్తిడి వల్ల దాదాపు ఎనిమిది వందల మంది వాల్మికీ హిందువులు మంగళవారం నాడు ఇస్లాం మతం స్వీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన పై విధంగా స్పందించారు.

Difficult days ahead for Muslims, will leave India if another country offers shelter, says Azam Khan

కాగా, తమ ఇళ్లను కాపాడుకునేందుకు 800 మందికి పైగా వాల్మీకి కులానికి చెందిన హిందువులు ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సమాజ్‌వాది పార్టీకి చెందిన మంత్రి అజాంఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్న రాంపూర్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అజాంఖాన్ కన్ను తమ ఇళ్లపై పడిందని, ఆయన షాపింగ్ మాల్స్ నిర్మించేందుకు తమ కులానికి చెందిన వారు నివసిస్తున్న ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఇబ్బంది పెడుతున్నారని స్థానిక వాల్మీకీలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయనను ప్రసన్నం చేసుకోవాలంటే మతం మారక తప్పదని 800మంది వాల్మీకీలు నిర్ణయించుకున్నారు. దీంతో అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ముస్లిం పెద్దల సమక్షంలో మతం మార్చుకున్నారు.

అంతకుముందు వాల్మీకి కులస్తులు ఉంటున్న స్థలం ప్రభుత్వానిదని, వాటిని వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంతోపాటు గత వారం ఆ ఇళ్లకు రెడ్ మార్క్ వేశారు స్థానిక అధికారులు. దీంతో వారంతా భయాందోళనకు గురయ్యారు.

ఇళ్లను కాపాడుకోవాలనుకుంటే మతం మార్చుకోవాలని కొందరు వారికి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమి లేక ముస్లిం మతం స్వీకరించినట్లు సమాచారం. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. నిరుపేదలను భయపెట్టి అజాంఖాన్ మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నారని పలువురు రాజకీయ నేతలు మండిపడ్డారు. కాన్పూర్‌లో అజాంఖాన్ దిష్టిబొమ్మను బిజెపి నేతలు దగ్ధం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+