అయ్యో అయ్యో అయ్యయ్యో.. ఎమ్మెల్యేకి టోకరా.. 30 లక్షలు స్వాహా !

దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ మోసాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇన్నాళ్లు సామాన్యులు మాత్రమే ఈ ఘటనల బాధితులుగా ఉండగా.. ఇప్పుడు ఏకంగా ఉన్నత పదవిలో ఉన్న వారు సైతం సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. కర్ణాటకలో ఓ మాజీ ఎమ్మెల్యే ఈ మోసానికి బలి అయ్యారు. ఎనిమిది రోజుల వ్యవధిలో ఆయన ఖాతా నుంచి దాదాపు రూ.30.99 లక్షలు స్వాహా చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఎలా జరిగిందంటే..?

బీదర్ జిల్లా ఔరద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండప్ప వకీల్కు ఆగస్టు 12న ఒక ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. మనీలాండరింగ్ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేశామని.. అతని వద్ద మాజీ ఎమ్మెల్యే బ్యాంక్ వివరాలు, ఏటీఎం కార్డు కాపీలు దొరికాయని చెప్పి వకీల్‌ను హెచ్చరించాడు. ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చని భయపెట్టాడు. కొద్దిసేపటికే మరో వ్యక్తి తనను దర్యాప్తు అధికారి అంటూ పరిచయం చేసుకుని, మాజీ ఎమ్మెల్యే నుండి వ్యక్తిగత, ఆస్తి వివరాలను సేకరించాడు. తర్వాత ఆయనను “డిజిటల్ అరెస్ట్” చేసినట్లు ప్రకటించాడు.

digital-arrest-scam-on-karnataka-ex-mla-and-lose-30-lakhs

నకిలీ కోర్టు, నకిలీ న్యాయమూర్తి..

మరుసటి రోజు వకీల్‌కు వీడియో కాల్ చేసి, ఆన్‌లైన్‌లో నకిలీ కోర్టు సెటప్, నకిలీ న్యాయమూర్తిని చూపించారు. వీడియోలో ఒక వ్యక్తి న్యాయమూర్తి వేషం వేసి, వకీల్ నిర్దోషి అని చెబుతూ ఒక ఒప్పందంపై సంతకం చేయమని ఆదేశించాడు. అదే సమయంలో, కేసు క్లియర్ కావాలంటే “సెక్యూరిటీ డిపాజిట్” పేరుతో మొదట రూ.10 లక్షలు RTGS ద్వారా ఒక బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించారు. దర్యాప్తు పూర్తయ్యాక మొత్తం డబ్బు తిరిగి వస్తుందని నమ్మబలికారు.

ఈ విధంగా మాజీ ఎమ్మెల్యే గుండప్ప వకీల్ ఎనిమిది రోజుల పాటు సైబర్ నేరగాళ్ల సూచనల ప్రకారం.. వేర్వేరు ఖాతాలకు రూ.30.99 లక్షలు బదిలీ చేసినట్టు వెల్లడించారు. చివరికి డబ్బులు తిరిగి రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. నేరగాళ్ల కాల్ డిటైల్ రికార్డులు, బ్యాంక్ ఖాతాల ట్రాన్సాక్షన్లను వెరిఫై చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు నమోదవుతున్నాయి. నేరగాళ్లు ఎక్కువగా CBI, ED, Income Tax అధికారులుగా నటించి భయపెడుతున్నారు. నకిలీ వీడియో కాల్ కోర్టులు మరియు డిజిటల్ అరెస్ట్ డ్రామాతో బాధితులను మోసం చేస్తున్నారు. ఈ మోసాలకు ఎక్కువగా పెద్ద స్థాయి వ్యక్తులు, వ్యాపారులు, ఉద్యోగులు బలి అవుతున్నారు. ఏ ప్రభుత్వ సంస్థ ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా అరెస్టు చేయదని.. ఎవరైనా సెక్యూరిటీ డిపాజిట్, జరిమానా పేరిట డబ్బు అడిగితే అది మోసం అని వెంటనే గుర్తించాలని సూచిస్తున్నారు. అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+