వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సినేషన్‌లో ఇన్ని లోపాలా-అట్టడుగు వర్గాల పరిస్థితేంటి-కేంద్రంపై సుప్రీం కోర్టు ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఉన్న లోపాలను ఏకరువు పెడుతూ సుప్రీం కోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోవిన్ యాప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకునే ప్రక్రియపై తాజాగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. డిజిటల్ అక్షరాస్యత అంతగా లేని దేశంలో ప్రత్యేకంగా కోవిన్ యాప్‌పై ఆధారపడి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టడం సరికాదని పేర్కొంది. ప్రాథమిక హక్కు అయిన సమానత్వంతో పాటు ఆరోగ్య హక్కుపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేత్రుత్వంలోని బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇలాంటి విధానాలు సమాజంలోని అట్టడుగు వర్గాలకు వ్యాక్సినేషన్‌కి అడ్డంకిగా మారుతాయని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పేదలు,అట్టడుగు వర్గాల ప్రజలు తమ స్నేహితుల సాయంతో ఆన్‌లైన్‌లో వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకుంటారన్న కేంద్రం వాదనను సుప్రీం తోసిపుచ్చింది. డిజిటల్ పరిజ్ఞానం ఉన్నవారే కోవిన్ యాప్‌లో వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది.కోవిన్ యాప్‌ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకునే అవకాశం అంధులకు లేదని తమ దృష్టికి వచ్చినట్లు సుప్రీం వ్యాఖ్యానించింది. అంధులకు కూడా యాక్సెస్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Digital Divide Will Have Serious Implications Supreme Court On CoWIN Portal

ఈ సందర్భంగా దేశంలో డిజిటల్ యాక్సెస్‌కి సంబంధించి ఓ సర్వే గణాంకాలను సుప్రీం కోర్టు ప్రస్తావించింది. 2018 నాటి జాతీయ గణాంకాల ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 4 శాతం ఇళ్లు,పట్టణ ప్రాంతాల్లో కేవలం 23 శాతం ఇళ్లల్లోనే కంప్యూటర్స్ ఉన్నట్లు తెలిపింది. దేశంలో 15-19 ఏళ్ల వయసున్నవారిలో గ్రామీణ ప్రాంతాల్లో 24 శాతం మంది,పట్టణ ప్రాంతాల్లో 56శాతం మందికి మాత్రమే కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చునని తెలిపింది. దేశవ్యాప్తంగా కేవలం 24శాతం ఇళ్లకు మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉందని పేర్కొంది. దేశంలో 50 శాతం కన్నా తక్కువ మంది ప్రజలు వైర్ లెస్ డేటా సర్వీసులను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.

ఈ గణాంకాలను గమనిస్తే గ్రామీణ ప్రాంతాలకు,పట్టణ ప్రాంతాలకు మధ్య డిజిటల్ యాక్సెస్ విషయంలో స్పష్టమైన తేడా కనిపిస్తోందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ లోపాలతోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తే గ్రామీణ ప్రాంతాలపై,అట్టడుగు వర్గాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొంది. కాబట్టి ఈ లోపాలపై దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

English summary
The court quoted from a National Statistics Office survey of 2018 which said that around four per cent of the rural households and 23% of the urban households possessed a computer Taking a dig at the Centre’s argument that the poor and marginalised can lean on friends to register online for vaccination, the Supreme Court has said even the digitally literate are finding it hard to get vaccine slots on CoWIN.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X