షాకింగ్ రిపోర్ట్.. ఇండియాలో టాప్ 10 'చెత్త' నగరాలు ఇవే..!

2016 లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేను నిర్వహిస్తారు. ఈ సర్వేలో భాగంగా దేశంలోని నగరాల పనితీరును అంచనా వేసి, ఉత్తమ నగరాలకు అవార్డులను అందిస్తారు. అయితే తాజాగా స్వచ్చ్ సర్వేక్షణ్ 2024-2025 రిపోర్టులో నగరాల్లో పరిశుభ్రత ఆధారంగా నగరాల లిస్టును రిలీజ్ చేసింది. ఈ లిస్టులో ముంబై ఆఖరి స్థానంలో నిలిచింది. ముంబై మహానగరం 10 లక్షలు జనాభా దాటిన నగరాల లిస్టులో అత్యంత చెత్త నగరంగా 33 వ స్థానంలో నిలిచింది.

ముంబై నగరం.. డర్టీ సిటీ లిస్టులో దేశ రాజధాని దిల్లీని దాటేసింది. దిల్లీ 31 వ స్థానంలో ఉంది. ఈ సర్వేలో తమిళనాడులోని మధురై టాప్ లో ఉంది. మధురై ర్యాంకు 40 గా ఉంది. 39 వ స్థానంలో పంజాబ్ లోని లుథియానా, 38 వ స్థానంలో చెన్నై, ఝార్ఖండ్ లోని రాంచీ 37 వ స్థానంలో, బెంగళూరు 36 వ స్థానంలో, ధన్ బాద్ 35 వ స్థానంలో ఫరీదాబాద్ 34 వ స్థానంలో నిలిచాయి. ఇక శ్రీనగర్ 32 వ స్థానంలో ఉంది.

దాంతోపాటు దేశంలోనే స్వచ్ఛమైన నగరాల లిస్టును కూడా కేంద్రం ప్రకటించింది. తాజా రిపోర్టు ప్రకారం.. గుజరాత్ లోని అహ్మదాబాద్ దేశంలోనే స్వచ్చమైన నగరంగా టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో భోపాల్, లక్నో, రాయ్ పుర్, జబల్ పూర్ ఉన్నాయి. ఇంకా గ్రేటర్ హైదరాబాద్, పింప్రీ చించ్వాడ్, పుణె, జీవీఎంసీ విశాఖపట్నం, ఆగ్రా నగరాలు కూడా టాప్ ప్లేస్ లోనే ఉన్నాయి.

Dirt Alert Madurai Tops India s 10 Dirtiest Cities in Swachh Survekshan 2025 Time for a Clean Sweep

స్వచ్చ్ సర్వేక్షణ్ 2024-2025 రిపోర్టులో భాగంగా విజిబుల్ క్లీన్ నెస్, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, శానిటేషన్, యూస్డ్ వాటర్ మేనేజ్ మెంట్.. పలు పేరామీటర్స్ ఆధారంగా ఈ లిస్టును రూపొందిస్తారు. ఈ క్రమంలో ముంబై వాసులు సామాజిక మాధ్యమాల్లో నగరంలోని చెత్త ప్రాంతాలను ఫోటోలు, వీడియోల రూపంలో పోస్టు చేస్తున్నారు. రోడ్లపై నీరు నిలిచిపోవడం, పాట్ హోల్స్, బిల్డింగ్స్ నుంచి టాయిలెట్ వాటర్ లీకేజీ తదితర సమస్యలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+