యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై అసంతృప్తి, సిద్ధూతో ఆ ఫ్యామిలీ భేటీ

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో/బెంగళూరు: ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారి కుటుంబ సభ్యులు మంగళవారం కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశారు. అనురాగ్ కర్నాటక క్యాడర్ ఐఏఎస్ అధికారి. మే 17వ తేదీన అనుమానాస్పద స్థితిలో లక్నోలో మృతి చెందారు.

దీనిపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేస్తున్న విచారణపై అనురాగ్ తివారి కుటుంబ సభ్యులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యను కలిసి సాయం కోరారు.

సిద్ధరామయ్యను అనురాగ్ తివారి సోదరుడు, తల్లిదండ్రులు కలిశారు. విచారణలో యోగి ప్రభుత్వం నిస్సాహయత కనిపిస్తోందని, జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Disappointed with Yogi government, Anurag Tewari's family seeks Siddaramaiah's help

ఇప్పటికే ఈ అంశంపై తాను యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశానని, సిబిఐ దర్యాఫ్తు కావాలని అడిగానని అధికారి కుటుంబ సభ్యులకు సిద్ధరామయ్య తెలిపారు.

కాగా, అనురాగ్ తివారి అనుమానాస్పద మృతిపై యూపీ ప్రత్యేక దర్యాఫ్తు బృందం విచారణ జరుపుతోంది. ఇందుకోసం ఆ టీమ్ బెంగళూరులోను విచారణ జరిపింది.

అంతేకాకుండా అనురాగ్ తివారి కుటుంబం ఆర్థిక సాయం కోసం కూడా ముఖ్యమంత్రిని కలిసినట్లుగా తెలుస్తోంది. తివారీ కర్నాటక కేడర్ అధికారి. కాబట్టి ఆర్థిక సాయం కోరినట్లుగా కూడా తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
IAS officer Anurag Tewari's family visited Karnataka Chief Minister Siddaramaiah on Tuesday seeking help. Disappointed with the probe by Uttar Pradesh police into the mysterious death of Anurag Tewari moving at a snail's pace, his brother and parents knocked on Karnataka government's doors.
Please Wait while comments are loading...