బీజేపీ రథ యాత్ర: మాజీ సీఎం యడ్యూరప్ప వాహనంపై బీజేపీ అసంతృప్తి కార్యకర్తల రాళ్ల దాడి !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బీజేపీలోని అసంతృప్తి కార్యకర్తలు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప వాహనంపై రాళ్లతో దాడి చేశారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి నవ కర్ణాటక నిర్మాణ పరివర్తనా యాత్ర చేపట్టింది. ఈ యాత్రలోనే రాళ్ల దాడి జరగడంతో బీజేపీ నాయకులు షాక్ తిన్నారు.

కర్ణాటక ప్రభుత్వానికి రూ. 1 లక్ష 50 వేల కోట్లు ఇచ్చాం, సీఎం లెక్క చెప్పాలి, బీజేపీ చీఫ్ అమిత్ షా !

ఇటీవల బెంగళూరులో నవ కర్ణాటక నిర్మాణ పరివర్తనా యాత్రను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించారు. బీఎస్ యడ్యూరప్ప కర్ణాటకలోని అన్ని శాసన సభ నియోజక వర్గాల్లో 75 రోజుల పాటు పర్యటించడానికి ప్రత్యేక వాహనం తయారు చేయించారు.

తెలుగు విద్యార్థులపై కన్నడిగుల దాడి, ఎందుకంటే..? Telugu students struggling in Karnataka | Oneindia
 Disgruntled BJP workers Stone pelted on BJP rathayatre vehicle in karnataka

తుమకూరు జిల్లా తురువకెరె శాసన సభ నియోజక వర్గంలోని బాణసంద్ర ప్రాంతంలో నవ కర్ణాటక నిర్మాణ పరివర్తనా యాత్ర కొనసాగింది. ఆ సందర్బంలో బీజేపీ నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన చౌధరి నాగేష్ కు మద్దతు ఇస్తున్న బీజేపీలోని అసంతృప్తి కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు.

బెంగళూరులో బీజేపీ ర్యాలీ, వేల సంఖ్యలో వాహనాలు: అమిత్ షాకు ట్రాఫిక్ సెగ, అంబులెన్స్ లు !

రాళ్ల దాడికి పరివర్తానా యాత్ర ముందు వెలుతున్న స్కార్పియో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మా నాయకుడు చౌధరి నాగేష్ ను పార్టీ నుంచి బహిష్కరించి మళ్లీ ఇక్కడికే వస్తారా అంటూ నిరసన వ్యక్తం చేశారు. చిక్కింది చాన్స్ అంటూ జేడీఎస్ కార్యకర్తలు సైతం నవ కర్ణాటక నిర్మాణ పరివర్తనా ర్యాలీ మీద రాళ్ల వర్షం కురిపించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Disgruntled BJP workers Stone pelted on BJP rathayatre vehicle in Banasandra village Turuvekere, Tumakur district on Friday.
Please Wait while comments are loading...