తమిళనాడు అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తే తన్ని తరిమేస్తారు జాగ్రత్త: వార్నింగ్ !
చెన్నై: అన్నాడీఎంకే పార్టీతో సంబంధం లేని టీటీవీ దినకరన్ వర్గంలోకి వెళ్లి తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు ఇప్పటికైనా బుద్ధిరావాలని అదే పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు వైతిలింగం అన్నారు.
బుధవారం ఎంపీ వైతిలింగం మీడియాతో మాట్లాడుతూ 18 మంది ఎమ్మెల్యేల మీద తమిళనాడు స్పీకర్ ధనపాల్ చట్టపరంగానే అనర్హత వేటు వేశారని అన్నారు. అన్నాడీఎంకే పార్టీ నియమాలు ఉల్లింఘించిన వారికి ఇలాగే జరుగుతుందనే విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

అనర్హతకు గురైన 18 మంది దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టడానికి అవకాశం లేదని అన్నారు. దౌర్జన్యంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తే అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వారిని మెడపట్టి బయటకు గెంటేస్తారని ఎంపీ వైతిలింగం అన్నారు.
అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేసిన స్పీకర్ ధనపాల్ ను తమిళనాడు మాజీ స్పీకర్ పీహెచ్. పాండియన్ సమర్థించారు. స్పీకర్ ధనపాల్ చట్టపరంగానే 18 మంది రెబల్ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకున్నారని మాజీ స్పీకర్ పీహెచ్. పాండియన్ చెప్పారు.












Click it and Unblock the Notifications