Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ తో పాటు వారిపై అనర్హత వేటుకు అన్నాడీఎంకే ఫిర్యాదు ..డీఎంకే ఎదురుదాడి

ఓటర్లను ప్రలోభ పెట్టడం కోసం ప్రతిపక్ష డీఎంకే నేతలు డబ్బులు పంచుతున్నారు అంటూ అధికార అన్నాడీఎంకే ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో డీఎంకే నాయకులు ఎం.కె.స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ సహా పలువురు నేతల అభ్యర్థిత్వంపై అనర్హత వేటు వేయాలని భారత ఎన్నికల కమిషన్ కు అన్నాడీఎంకే నేడు ఫిర్యాదు చేసింది.

 డీఎంకే నేతలను అనర్హులుగా ప్రకటించాలని అన్నాడీఎంకే ఫిర్యాదు

డీఎంకే నేతలను అనర్హులుగా ప్రకటించాలని అన్నాడీఎంకే ఫిర్యాదు

ప్రతిపక్ష ద్రావిడ మున్నేట కజగం (డీఎంకే) తమిళనాడులోని ఐదు నియోజకవర్గాల్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని, ప్రలోభాలకు గురి చేస్తున్నారని, ఈ కారణాలతో వారిని అనర్హులుగా ప్రకటించాలని పాలక అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట కజకం (ఎఐఎడిఎంకె) ఈ రోజు పోల్ ప్యానెల్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది . ఈ ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికలను రద్దు చేయాలని పార్టీ కోరింది. డిఎంకె చీఫ్ మరియు అతని కుమారుడు కాకుండా, ఈవి వేలు, కెఎన్ నెహ్రూ మరియు దురై మురుగన్ లను అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్ కు చేసిన ఫిర్యాదులో అన్నాడీఎంకే కోరింది.

 ఐదు నియోజకవర్గాల డీఎంకే అభ్యర్థులను టార్గెట్ చేసిన అన్నాడీఎంకే

ఐదు నియోజకవర్గాల డీఎంకే అభ్యర్థులను టార్గెట్ చేసిన అన్నాడీఎంకే

అన్నాడిఎంకె ఐదు నియోజకవర్గాలు కోలాతూర్, కట్పాడి, చేపాక్-ట్రిప్లికేన్, తిరుచిరాపల్లి, మరియు తిరువన్నమలై లలో ఎన్నికలు ఆపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు విన్నవించింది . డీఎంకే నాయకుడు, ప్రతిపక్ష నేత స్టాలిన్ కోలాతూర్ నుండి పోటీ చేస్తుండగా, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేపాక్ లో పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాడు. కాట్పాడి నుండి దురై మురుగన్ , తిరుచిరాపల్లి నుండి నెహ్రూ, తిరువన్నమలై నుండి వేలు నుండి ఎన్నికల బరిలో ఉన్నారు.

అన్నాడీఎంకే ఫిర్యాదుపై స్పందించిన డీఎంకే నేత కనిమొళి

అన్నాడీఎంకే ఫిర్యాదుపై స్పందించిన డీఎంకే నేత కనిమొళి

అన్నాడీఎంకే నేతలు ఆరోపణలను డీఎంకే నేతలు ఖండిస్తున్నారు. తమిళనాడు ఎన్నికలలో డీఎంకే నేతలు ఘన విజయం సాధించబోతున్నారని అన్నాడీఎంకే భయపడుతుందని, అందుకే పార్టీ ముఖ్య నాయకులని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తున్నారని డీఎంకే ప్రతినిధి కనిమొళి పేర్కొన్నారు . ఈ రోజు ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదు లేఖలో ఎ.ఐ.ఎ.డి.ఎం.కె యొక్క న్యాయవాదుల వింగ్ జాయింట్ సెక్రటరీ ఆర్.ఎమ్. బాబు మురుగవేల్, స్టాలిన్ యొక్క అనుబంధ సంస్థలు మరియు సహచరులు ఓటర్లకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున ఏప్రిల్ 2 నుండి రహస్యంగా పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.

 జీ పే ద్వారా ఓటర్లకు ఒక్కో ఓటుకు 5 వేలు ఇస్తున్నారని ఫిర్యాదు

జీ పే ద్వారా ఓటర్లకు ఒక్కో ఓటుకు 5 వేలు ఇస్తున్నారని ఫిర్యాదు

కొలాతూర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎం.కె.స్టాలిన్, దుర్గా స్టాలిన్, అక్కడే ఉండి, అన్ని మహిళల స్వయం సహాయక బృందాలను డబ్బులు ఇచ్చి ప్రలోభ పెడుతున్నారని, మహిళా స్వయం సహాయక సంఘాల గ్రూపులకు పని చేయడానికి, కాన్వాస్, ఖర్చు , వారి ఓట్లు తమకు వేసేందుకు డబ్బులను ఎరగా వేస్తున్నారని మురుగవేల్ పేర్కొన్నారు . డీఎంకే నేత స్టాలిన్ మరియు అతని సహచరులు జి-పే ద్వారా ఓటర్లకు డబ్బు చెల్లించారని ఆరోపించారు.

 మరికొద్ది గంటల్లో తమిళనాడు ఎన్నికలు .. డీఎంకే పై అన్నాడీఎంకే ఫిర్యాదులు

మరికొద్ది గంటల్లో తమిళనాడు ఎన్నికలు .. డీఎంకే పై అన్నాడీఎంకే ఫిర్యాదులు

వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. తమిళనాడు రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలు డీఎంకే నేతలపై ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదు తమిళనాడు రాష్ట్రంలో దుమారం గా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+