Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆర్ఆర్ నగర్ మీద కన్ను వేసిన డీకే. మొత్తం బయటకు లాగుతామని ప్రతిపక్షానికి వార్నింగ్ !

బెంగళూరు: బెంగుళూరులోని రాజరాజేశ్వరి నగర్ ఎన్నికల సమయంలో వార్తల్లో నిలిచినంతగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజక వర్గం గురించి అంత హాట్ టాపిక్ కాలేదు. ఎన్నికల ప్రచారంతో తెరపైకి వచ్చిన ఇక్కడి బీజేపీ నాయకులు నియోజకవర్గంలో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ అవకతవకలన్నింటిపై విచారణ జరుపుతామని కర్ణాటక డీసీఎం డీకే. శివకుమార్ తెలిపారు.

మత్తికెరెలోని జేపీ పార్కులో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్‌ మాట్లాడుతూ మల్లత్తహళ్లి చెరువు, హొసకెరె, జేపీ పార్కు అభివృద్ధి పేరుతో కణ్మరె చెరువు పునర్‌ నిర్మాణం, కొన్ని గార్డెన్‌ల అభివృద్ధి పేరుతో జరిగినన అవకతవకలపై తగు విచారణ జరిపి ప్రజలకు తెలియజేస్తామని, అందులో ఎలాంటి అవకతవకలు జరగవని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు.

dkshivakumar

బెంగళూరు సౌత్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఆర్‌ఆర్‌ నగర్‌లో అభివృద్ధి పేరుతో అక్రమాలకు పాల్పడిన బీజేపీ ఎమ్మెల్యేలు మునిరత్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలిచారో అనే విషయం ప్రజలకు తెలియజేస్తామని,. ఇందుకు సంబంధించి జరిగిన అక్రమాలను బయటపెడుతామని చెప్పారు. బెంగళూరులో త్వరలో బీబీఎంపీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయని, అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని డీకే. శివకుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మనవి చేశారు.

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు మీరంతా కృషి చేయ్యాలని డీకే శివకుమార్ కాంగ్రెస్ కార్యకర్తలకు మనవి చేశారు. బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని, దాని ద్వారా బెంగళూరు అభివృద్ధికి మీరు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సదస్సులో డీకే శివకుమార్ ఆ పార్టీ కార్యకర్తలకు మనవ చేశారు.

dkshivakumar

ఇదిలావుండగా, ఆర్‌ఆర్‌నగర్ నియోజకవర్గానికి కొంత కళంకం ఉందని, దానిని త్వరలో తెరమరుగు చేస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ డీకే. సురేష్ అన్నారు. ఇదే సందర్బంలో బీజేపీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలొ చేశారు. కాంగ్రెస్‌లో స్థానికులు, వలసలు అనే తేడా లేకుండా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి అందరూ చైతన్యవంతం కావాలని డీకే సురేష్ అన్నారు.

బెంగళూరు నగరంలోని ఆర్ఆర్ నగర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద పోటీ చేసి ఓడిపోయిన కుసుమా మాట్లాడుతూ తాను ఎవరి మీద పగలు, ప్రతీకారాలు తీర్చకోవాలన అనుకోవడం లేదని అన్నారు. ఈనియోజక వర్గంలో అక అక్రమాలు, మోసాలు చేశారని, వారిని దేవుడు కూడా క్షమించడని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మునిరత్నను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుసుమా అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+