అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు జంప్?, రాత్రి అందుకే వచ్చారని డీసీఎం క్లారిటి, డీకే మార్క్ రాజకీయాలు!
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీకి చెందిన చాలా మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని లీకులమీద లీకులు అవుతున్నాయి. ఇదే సమయంలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక బీజేపీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమావేశానికి హాజరైనారని మీడియాలో వార్తలు రావడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బెంగళూరులోని యశ్వంత్‌పురం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే టీ. సోమశేఖర్, యల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే శివరాం హెబ్బార్, విధానపరిషత్ సభ్యుడు హెచ్. విశ్వనాథ్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరుతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కన్నడ మీడియా కోడైకూస్తోంది.

ఈ విషయమై బెళగావిలోని సువర్ణసౌధలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ బుధవారం రాత్రి జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు సోమశేఖర్, శివరామ్ హెబ్బార్ రాలేదని, మేం ఆహ్వానించిన విందుకు (డిన్నర్) వచ్చారని డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. విందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వచ్చారా అన్న మీడియా ప్రశ్నకు డీకే శివకుమార్ సమాధానం ఇచ్చారు.
విందుకు బీజేపీ ఎమ్మెల్సీ విశ్వనాథ్ సహా ఇతర పార్టీలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారని, అందులో తప్పు ఏముందని డీకే శివకుమార్ అన్నారు. సీఎల్పీ సమావేశానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వచ్చారా అని మీడియా ప్రశ్నించగా మా శాసన సభ్యుల సమావేశానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఎందుకు వస్తారు ?, వాళ్లకు మా శాసన సభ్యుల సమావేశంలో పని ఏముందని డీకే శివకుమార్ మీడియాను ప్రశ్నించారు.

విశ్వనాథ్ మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కాదు, సోమశేఖర్, శివరాం హెబ్బార్ మా పార్టీ ఎమ్మెల్యేలు కాదు కాబట్టే మా శాసన సభ్యుల సమావేశానికి వాళ్లు హాజరుకాలేదని డీకే శివకుమార్ అన్నారు. మీపై సీబీఐ కేసుల విచారణ ఉపసంహరణపై శాసనసభలో తీర్మానం ప్రతిపాదించేందుకు బీజేపీ సిద్ధం అవుతోందా అని మీడియా ప్రశ్నించగా అది వాళ్ల హక్కు, వాళ్లు కూడా (బీజేపీ ఎమ్మెల్యేలు) ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అయ్యారు, శాసనసభ సమవేశాల్లో వాళ్లు అనుకున్న పని సవ్యంగా జరగాలని నేను కూడా దేవుడిని కోరుకుంటున్నానని డీకే శివకుమార్ వ్యంగంగా అన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications