తనకు, సీఎంకు కీడు జరగాలని కేరళలో అఘోరాలతో యాగాలు, ఏం చేస్తారో చూడాలి, డీకే !

కేరళలో మాంత్రికుల పెట్టుకుని అనేక మంత్రసామాగ్రిని ఉపయోగించి నాకు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కీడుజరగాలని, మాకు వ్యతిరేకంగా శత్రు భైరవి యాగం ప్రయోగం జరుగుతోందని, మేము దీనిని పట్టించుకోమని, మేము నమ్ముకున్న బలం, భగవంతుడు, ప్రజల ఆశీస్సులే మమ్మల్ని కాపాడతాయని కర్ణాటక డీసీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు.

గురువారం బెంగళూరులోని సదాశివనగర్ నివాసంలో కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ నాపై, ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై, కాంగ్రెస్ పార్టీ నాశనం కావాలని కేరళలో ప్రత్యేక యాగం జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలోని రాజరాజేశ్వరి దేవాలయం చుట్టుపక్కల ఉన్న నిర్జన ప్రాంతంలో శత్రువులను చంపేందుకు చేసే రాజకంటకం, మరన్ మోహన స్తంభన యాగం చేస్తున్నారని డీకే శివకుమార్ ఆరోపించారు.

DK Sivakumar accused of performing sacrifices with witches in Kerala to harm him and the CM

ఈ యాగంలో పాల్గొన్న వారు ఈ యాగం ఎవరు చేస్తున్నారో వివరాలు తెలియజేసినట్లు డీకే శివకుమార్ మీడియాకు తెలిపారు. అఘోరాల ద్వారా ఈ యాగం జరుగుతోందని, దీనికి పంచబలి సమర్పిస్తున్నారని తనకు సమాచారం ఉందని డీకే శివకుమార్ ఆరోపించారు. 21 ఎర్ర రంగు మేకలు, 3 గేదెలు, 21 నల్ల రంగు గొర్రెలు, 5 పందులను ఇదే యోగం సందర్బంగా బలి ఇవ్వడం ద్వారా ఈ మాయాజాలం జరుగుతోందని డీకే శివకుమార్ ఆరోపించారు.

వారు చేసే ప్రయత్నాలు వారిని చెయ్యనివ్వండి, నేను దాని గురించి ఏమాత్రం పట్టించుకోనని, వారి విశ్వాసం వారిది. అందుకే అలాంటి ప్రయత్నం చేస్తున్నారని, వారు మాపై ఎలాంటి చెడు ప్రయోగాలు చేసినా నేను ఏమాత్రం పట్టించుకోనని డీకే శివకుమార్ అన్నారు. నేను నమ్మే శక్తి మనల్ని రక్షిస్తుందని, నేను ప్రతిరోజు ఇంటి నుండి బయలుదేరే ముందు ఒక నిమిషం పాటు దేవుడిని ప్రార్థిస్తానని డీకే శివకుమార్ మీడియాకు చెప్పారు.

DK Sivakumar accused of performing sacrifices with witches in Kerala to harm him and the CM
భార్యల రహస్యాలు చెప్పాలంటే ఇంత ఇవ్వాలి, ఫోన్ కాల్ డేటా, సీడీఆర్ సేల్, పక్కాప్లాన్ తో !

ఈ యాగం బీజేపీ చేస్తుందా, లేక జేడీఎస్ చేస్తుందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా డీకే శివకుమార్ సమాదానం ఇచ్చారు. మాకు వ్యతిరేకంగా ఎవరు యాగం చేస్తున్నారో మాకు తెలుసునని బదులిచ్చారు. నిమ్మకాయ నిపుణులు ఇలా చేస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా ఆ మాట నాకు చెప్పే బదులు మీరే దీనిపై ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ తయారు చేయండి అని డీకే శివకుమార్ అన్నారు. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని మీడియా ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలీదని డీకే శివకుమార్ అన్నారు,

మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఏమైనా ప్రత్యేకంగా యాగాలు చేస్తున్నారా? అని డీకే శివకుమార్ ను మీడియా ప్రశ్నించింది. వారు ఏమి చేసినా నా శక్తి నన్ను కాపాడుతుందని, నా బలం నన్నురక్షిస్తుందని, నేను అలాంటి యాగాలు ఏమీ చేయను అని, తాను దేవుడిని మాత్రమే నమ్ముతానని డీకే శివకుమార్ మీడియాకు చెప్పారు. మొత్తం మీద సీఎం సిద్దరామయ్య, తనకు వ్యతిరేకంగా పంచబలి యాగం జరుగుతోందని డీసీఎం డీకే శివకుమార్ ఆరోపణలు చెయ్యడం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+