డేట్ ఫిక్స్ చేసిన క్యాప్టెన్ విజయ్ కాంత్: ఆరోజు బరిలోకి ! ప్రేమలత

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ నియోజక వర్గంలో తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి పలు పార్టీల నాయకులు శక్తి వంచన లేకుండా ప్రచారం చేస్తున్నారు.

శశికళ రాజకీయ వేధింపుల వాస్తవాలు: పన్నీర్ సెల్వం, రౌడీషీటర్లు!

ఇప్పుడు ఆకోవలోకి డీఎండీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు, సినీనటుడు క్యాప్టెన్ విజయ్ కాంత్ చేరారు. ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఆర్ కే నగర్ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తన్న తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సుడిగాలి పర్యటన చెయ్యాలని రంగం సిద్దం చేసుకుంటున్నారు.

DMDK leader Vijayakanth will begin campaign from Apr 6 for RK Nagar By election

విజయ్ కాంత్ కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో ఆర్ కే నగర్ ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆర్ కే నగర్ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న డీఎండీకే పార్టీ అభ్యర్థి తరపున విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత ప్రచారం చేస్తున్నారు.

ఏ ముఖం పెట్టుకుని వచ్చావు: ఆర్ కే నగర్ లో దినకరన్ కు షాక్: కాళ్లబేరానికి!

విజయ్ కాంత్ ఆరోగ్యం కుదటపడుతోందని, త్వరలోనే ఆయన కోలుకుని ఆర్ కే నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గోంటారని ప్రేమలత అక్కడి డీఎండీకే పార్టీ కార్యకర్తలకు చెప్పారు. విజయ్ కాంత్ ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రచారం చేస్తారని ఆయన భార్య ప్రేమలత, ఆ పార్టీ నాయకులు గురువారం అధికారికంగా ప్రకటించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Premalatha said that Vijayakanth’s health condition is stable and the chances of him campaigning in RK Nagar are also bright. Vijayakanth is gradually recovering from the illness and he will be discharged soon.
Please Wait while comments are loading...