వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీర్ సెల్వం గ్రేట్: మంచి నిర్ణయం, స్వాగతిస్తున్నాం: స్టాలిన్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ చేపట్టాలని సీఎం పన్నీర్ సెల్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఎంకే.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ చేపట్టాలని సీఎం పన్నీర్ సెల్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఎంకే, స్టాలిన్ చెప్పారు. బుధవావరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రజలకు దగ్గర అయ్యారని గుర్తు చేశారు. జయలలిత మృతిపై ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయని స్టాలిన్ అన్నారు. జయలలిత మృతిపై విచారణ చేపట్టాలని డీఎంకేతో సహ తమిళనాడులో అనేక పార్టీలు డిమాండ్ చేసిన విషయం ఇదే సమయంలో గుర్తు చేశారు.

ఇప్పటికైనా సీఎం పన్నీర్ సెల్వం సరైన నిర్ణయం తీసుకుని జయలలిత మృతిపై విచారణ చెయ్యడానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చెయ్యడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఈ విచారణతో ప్రజలలో ఉన్న అనుమానాలు పూర్తిగా తొలగిపోతాయని స్టాలిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

DMK Acting President MK Stalin welcome that the probe on Jayalalithaa's death.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఎంక్త్వైరీ కమిటీతో ప్రత్యేక దర్యాప్తు చెయ్యాలని ఆ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అమ్మ ఎలా మరణించారు అని ప్రజలకు తెలియాలని పన్నీర్ సెల్వం చెప్పారు.

జయలలిత ఎలా మరణించారు అని తమిళనాడు ప్రజలు ప్రశ్నిస్తున్నారని పన్నీర్ సెల్వం అన్నారు. జయలలిత మరణంపై ప్రజలకు ఉన్న అనుమానాలు పూర్తిగా తొలగిపోవాలని, జయలలిత ఎలా మరణించారు ? అనే అసలు వాస్తవాలు ప్రజలకు తెలియాలని పన్నీర్ సెల్వం గుర్తు చేశారు.

అందుకే అమ్మ జయలలిత ఎలా మరణించారు ? అనే విషయం వెలుగు చూడటానికి ప్రత్యేకంగా ఎంక్త్వైరీ కమిటీతో విచారణ చేయించి అసలు వాస్తవాలు బయటకులాగుతామని పన్నీర్ సెల్వం సంచల వ్యాఖ్యలు చేశారు. శశికళ మీద తిరుగుబాటు చేసిన కొన్ని గంటలకు పన్నీర్ సెల్వం జయలలిత మృతిపై విచారణ చేపట్టాలని సంచలన నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చెయ్యడంతో శశికళ వర్గీయులు హడలిపోతున్నారు.

English summary
DMK Acting President MK Stalin welcome that the probe on Jayalalithaa's death.Tamil Nadu CM Panneerselvam to set up inquiry commission to probe into Jayalalithaa's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X