ఆసుపత్రిలో డీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కురుణానిధి: కావేరి ఆసుపత్రి క్లారిటీ !
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం. కరుణానిధి బుధవారం ఆసుపత్రిలో చేరారు. సాధారణ చికిత్స కోసం కరుణానిధి చెన్నైలోని అళ్వార్ పేటలోని కావేరి ఆసుపత్రిలో చేరారని డీఎంకే వర్గాలు తెలిపాయి. కొంత కాలంగా ట్రాకియోటమీతో కరుణానిధి బాధపడుతున్నారు.

ట్రాకియోటమీ (శ్వాస నాళాలు) చికిత్స కోసం బుధవారం కరుణానిధిని కావేరి ఆసుపత్రికి తరలించారని తెలిసింది. కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న కరుణానిధి ఇంటికే పరిమితం అయ్యారు. ఈ చికిత్సలో భాగంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ట్రాకియోటమీ ట్యూబ్ మార్చ వలసి ఉంటుంది.
Press Release from Kauvery Hospital...-Admin pic.twitter.com/164pvPTuAE
— KalaignarKarunanidhi (@kalaignar89) July 18, 2018
బుధవారం కరుణానిధి ట్రాకియోటమీ చికిత్స కోసమే ఆసుపత్రిలో చేరారని డీఎంకే వర్గాలు అంటున్నాయి. కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని, సాధారణ చికిత్సలో భాగంగా ఆయన ఆసుపత్రికి వచ్చారని, ఆయన అభిమానులు ఆందోళన చెందనవసరం లేదని కావేరీ ఆసుపత్రి వర్గాలు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే డీఎంకే పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో కావేరి ఆసుపత్రి ముందు గుమికూడటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులు కావేరి ఆసుపత్రిలోనే ఉన్నారు.












Click it and Unblock the Notifications