భార్య నైటీలో వచ్చి..., చూడాలని మహిళలు(పిక్చర్స్)

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 117 స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో చెన్నైలో ఓ ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) అభిమాను ఒకరు తన భార్య నైటీలో వచ్చి ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

సదరు వ్యక్తి తొలుత డిఎంకె లోగోలతో కూడిన దోవతీతో పోలింగ్ బూత్‌లోకి వచ్చి ఓటు వేసే ప్రయత్నం చేశాడు. ఇది ఆయనకు బెడిసి కొట్టింది.

దీంతో ఆ తర్వాత అతను ఇంటికి వెళ్లాడు. ఆ హడావుడిలో ఆయనకు వేసుకునేందుకు ఏం దొరకలేదు. దీంతో అతను తన భార్య నైటీ వేసుకొని వచ్చి ఓటు వేసి వెళ్లిపోయాడు.

నైటీతో..

నైటీతో..

నైటీతో వచ్చి ఓటు వేసిన హార్డ్ కోర్ డిఎంకె అభిమాని అరవకురిచి పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఇది కరూర్ నియోజకవర్గం కిందకు వస్తుంది.

ఎన్నికలు

ఎన్నికలు

తొమ్మిది దశల ఎన్నికల్లో ఇది రెండో అతిపెద్దది. ఈ దశ ముగియడంతో దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు.. 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో 349 స్థానాలకు ఎన్నికలు ముగిసినట్లయింది.

ఎన్నికలు

ఎన్నికలు

దీంతో సార్వత్రిక ఎన్నికల క్రతువు మూడొంతులు పూర్తయింది. మరో మూడు దశల్లో 9 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.

ఎన్నికలు

ఎన్నికలు

ఆరో దశలో ఓటర్ల తీర్పు కోరిన ప్రముఖుల్లో ఐదుగురు కేంద్ర మంత్రులు, లోకసభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ తదితరులు ఉన్నారు.

ఎన్నికలు

ఎన్నికలు

ప్రధాని మన్మోహన్ సింగ్‌తోపాటు క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ ప్రముఖులు రేఖ, విద్యాబాలన్, సోనమ్ కపూర్, ధర్మేంద్ర, అమీర్‌ఖాన్ తదితరులు ఓటేశారు.

ఎన్నికలు

ఎన్నికలు

వ్యాపార ప్రముఖులు.. అనిల్ అంబాని, ఆది గోద్రేజ్, ఎస్బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య తదితరులు ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఎన్నికలు

ఎన్నికలు

ఈ దశలో అత్యధికంగా పుదుచ్ఛేరిలో 83 శాతం పోలింగ్ నమోదు కాగా, అతి తక్కువగా జమ్ము కశ్మీర్(అనంత్‌నాగ్ లోకసభ)లో 28 శాతం పోలింగ్ నమోదైంది.

ఎన్నికలు

ఎన్నికలు

సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో భాగంగా గురువారం ముంబయి నగరంలో జరిగిన పోలింగ్‌లో రేఖ, విద్యాబాలన్, అమీర్ ఖాన్, సోనమ్ కపూర్ వంటి బాలీవుడ్ తారలు త్వరగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఎన్నికలు

ఎన్నికలు

అనేకమంది సెలబ్రిటీలు తాము ఓటు వేసినట్లు ధ్రువీకరించే సిరా రాసిన చూపుడు వేలిని ట్విట్టర్‌లో ప్రదర్శించారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని తమ అభిమానులకు పిలుపునిచ్చారు.

ఎన్నికలు

ఎన్నికలు

యుటివి అధినేత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో వివాహానంతరం ముంబయి శివారులోని జుహులో నివాసముంటున్న విద్యాబాలన్ చెంబూర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+