అసెంబ్లీలో స్టాలిన్ అండ్ కో గొడవ ఎందుకంటే, అసలు విషయం ఇదే !
ప్రజల జీవితాలతో చెలగాటం ఆడాలనుకుంటున్న శశికళ వర్గంలోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని ఎలాగైనా డిస్మిస్ చేయించాలని డీఎంకే పార్టీ ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే బలపరీక్ష సందర్బంగా రహస్య ఓటింగ్.
చెన్నై: తమిళనాడులో డీఎంకే పార్టీ చాకచక్యంగా పావులుకదుపుతోంది. శనివారం అసెంబ్లీలో డీఎంకే ఎమ్మెల్యేలు చేసిన రాద్దాంతానికి ఓ కారణం ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. శశికళ వర్గం మీద మొదటి నుంచి స్టాలిన్ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.
అయితే శనివారం తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వ బలపరిక్షను అడ్డుకోవడానికి డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు అడుగడుగునా అడ్డుపడుతూనే వచ్చారు. అందుకు ఓ బలమైన కారణం ఉందని డీఎంకే పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు

తమిళనాడు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఎలాగైన డిస్మిస్ చేయించాలని డీఎంకే నిర్ణయించింది. అందులో భాగంగానే శాసన సభసమావేశంలో డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారని సమాచారం.
ఎలాగైనా ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయించాలని డీఎంకే పార్టీ ప్రయత్నిస్తోందని సమాచారం. అందులో భాగంగానే బలపరీక్ష సందర్బంగా రహస్య ఓటింగ్ జరిపించాలని డీఎంకే పట్టుబడుతుంది.
రహస్య ఓటింగ్ లో శశికళ వర్గంలోని ఆరు మంది ఎమ్మెల్యేలు పళనిసామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేస్తే ప్రభుత్వం కుప్పకూలిపోతుందని డీఎంకే పార్టీ నాయకులు అంటున్నారు. వీలైనంత వరకు ఓటింగ్ ను అడ్డుకోవడమే డీఎంకే ధ్యేయం అని సమాచారం.












Click it and Unblock the Notifications