ఇంజినీరింగ్ పోటీలు: డూ యిట్ యువర్ సెల్ఫ్
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని ప్రముఖ విద్యా సంస్థ ఆచార్య ఇనిస్టిట్యూట్ మరో మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. పాలీటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం ‘డూ యిట్ యువర్ సెల్ఫ్'(do it yourself) పేరుతో రాష్ట్రస్థాయిలో టెక్నికల్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ నిర్వహిస్తోంది. విద్యార్థులు తమ ప్రతిభను, టెక్నికల్ చైతన్యాన్ని, నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇదొక మంచి వేదిక కానుందని నిర్వాహకులు తెలిపారు.
120 ఎకరాల్లో విస్తరించిన ఆచార్య ఇనిస్టిట్యూట్ ఈకో ఫ్రెండ్లీ వైఫై సౌకర్యాలను కలిగి ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి కార్యక్రమాలను, పాఠ్యా ప్రణాళిక, ఇతర పోటీలను ఆచార్య ఇనిస్టిట్యూట్ నిర్వహించింది. 81 అంశాలపై తాము నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో సుమారు 10వేల మందికి పైగా విద్యార్థులు, దేశ, విదేశాల నుంచి తరలివచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆచార్య ఇనిస్టిట్యూట్ (పాలీటెక్నికల్/టెక్నికల్ క్యాంపస్), డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ఇప్పటికే పేరుపొందిన ‘డూ యిట్ యువర్ సెల్ఫ్ టెక్నికల్ ప్రాజెక్ట్ కాంపిటీషన్' నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి 16, 17 తేదీల్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరవుతున్న రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌వి దేశ్‌పాండే ప్రారంభించనున్నారు. యెలహంక ఎమ్మెల్యే విశ్వనాథ్ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
టెక్నికల్ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు, యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తమ కళాశాల యొక్క సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఇలాంటి కాంపిటీషన్లలో పాలీటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలు పాల్గొనాలని సూచించారు. 55 కళాశాలల నుంచి 170 ప్రాజెక్టులు వచ్చాయని, నూతన ఆవిష్కరణలను పంచుకోవడం జరుగుతుందని చెప్పారు.
కార్యక్రమ ముగింపు సందర్భంలో ఉత్తమ ప్రాజెక్టుకు, ఆవిష్కరణలకు సరైన బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుందని ఇనిస్టిట్యూట్ నిర్వాహకులు చెప్పారు. ఈ రాష్ట్రస్థాయి కాంపిటీషన్‌కు మీడియా భాగస్వాములుగా ది హిందూ, ఉదయవాణి, వన్ ఇండియా.కాం, కస్తూరి 24X7 ఉన్నారని నిర్వాహకులు చెప్పారు.












Click it and Unblock the Notifications