వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

24గంటల విద్యుత్ కోసం మంత్రిత్వశాఖకు నిధులెలా వస్తాయంటే?

అందరికి 24 గంటల విద్యుత్ పంపిణీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ పథకానికి నిధులు ఎలా అందుతున్నాయో వివరించారు ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అందరికి 24 గంటల విద్యుత్ పంపిణీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ పథకానికి నిధులు ఎలా అందుతున్నాయో వివరించారు ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి.

భారత విద్యుత్ మంత్రిత్వ శాఖ ఐఎఫ్ఎస్ జాయింట్ సెక్రటరీ డా. ఏకే వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. బొగ్గు ఆధారిత, పునరుత్పాదక వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తితో విద్యుత్ రంగం.. 2030 వరకు 1ట్రిలియన్ పెట్టుబడులను ఆకర్షిస్తుంది.

కాగా, ఐఈఏ అంచనాల ప్రకారం.. 2015-2040 సంవత్సరాల మధ్య కాలంలో భారత్ 845 బిలియన్ డాలర్ల పెట్టుబడులను టీఅండ్ డీ(ట్రాన్స్‌మిషన్, డస్ట్రిబ్యూషన్) నెట్‌వర్క్స్‌లో వెచ్చించనుంది.

వివిధ విభాగాల్లో పెట్టుబడుల అవకాశాలు ఇలా వున్నాయి..

వచ్చే దశాబ్ద కాలంలో స్మార్ట్ మీటరింగ్, డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్, బ్యాటరీ స్టోరేజీ, ఇతర స్మార్ట్ గ్రిడ్ మార్కెట్ విభాగాల కోసం -రూ.2.9లక్షల కోట్లు

కేపిటల్ కాస్ట్ మెగా వాట్‌కు రూ.5.5కోట్లు కాగా, అదననంగా 1,00,000 మెగావాట్ల సోలార్ పవర్ సామర్థ్యం కోసం రూ. 5.5 లక్షల కోట్లు

Do you know how Power Ministry get funds for 24X7 power supply?

45,000 మెగావాట్లకు పైగా థర్మల్ పోర్ట్ ఫోలియో కోసం రూ.4.4లక్షల కోట్లు
సోలార్ రూఫ్ టాప్, ఫ్రైంఛైజీ, డీఎస్ఎం, స్మార్ట్ మీటర్ల మొదలగు వాటి కోసం నూతన పెట్టుబడులు పెట్టనున్నారు.

డిస్కమ్స్ ద్వారా ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజన(ఉదయ్) విద్యుత్ రంగం సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో పెంచనుంది. దీని ద్వారా మరింత మొత్తం పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.

ఉదయ్ ద్వారా భారతదేశంలోని విద్యుత్ పంపిణీ కంపెనీ(డిస్కమ్స్-డిస్ట్రిబ్యూషన్ కంపనీస్ ఆఫ్ ఇండియా)లకు పునరుజ్జీవం తీసుకువచ్చేందుకు మరో ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. విద్యుత్ పంపిణీలో సమస్యలను శాశ్వతంగా తొలగించేందుకు ఉదయ్ ప్రయత్నిస్తోంది.

English summary
According to Dr. AK Verma, IFS Joint Secretary, Ministry of Power, Government of India.. Power sector is likely to attract around $ 1 trillion in investments by 2030 across segments such as coal - based and renewable power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X