దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఏదో తెలుసా..?

దేశంలో నిత్యం లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ధరకే సుదూర ప్రాంతాలకు రైలు ప్రయాణం ద్వారా చేరుకోవచ్చు. అందువల్ల పేద, మధ్య తరగతి ప్రజలు ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తే రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. దేశవ్యాప్తంగా 7 వేలకు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. రోజూ 22 వేల రైళ్లు ప్రయాణం సాగిస్తుంటాయి. రోజూ దేశవ్యాప్తంగా 2.4 కోట్ల మంది రైలులోప్రయాణిస్తుంటారు. అయితే మనదేశంలో చాలా రైల్వే స్టేషన్లు పేరుపొందాయి. అందులో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ గా కోల్ కతాలోని హౌరా రైల్వే స్టేషన్ నిలిచింది.

హౌరా రైల్వే స్టేషన్ 1854 లో నిర్మించారు. ఇది భారత్ లోనే పురాతన రైల్వే స్టేషన్ గా పేరుగాంచింది. ఇది విస్తీర్ణం పరంగా.. ప్లాట్ ఫామ్స్ పరంగా దేశంలోనే అతి పెద్ద రైల్వే ప్లాట్ ఫామ్ గా ఉంది. హౌరా రైల్వే స్టేషన్ లో 23 ప్లాట్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇది ప్రస్తుతం దేశంలోనే అత్యంత రద్దీ అయిన రైల్వే స్టేషన్ గా పేరు గాంచింది. ఈస్టర్న్ ఇండియాలోని అన్ని రైల్వే స్టేషన్లకు ఇది ప్రధాన గేట్ వే మార్గంగా ఉంది. వెస్ట్ బెంగాల్ నుంచి ప్రధాన నగరాలను కలుపుతుంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు.

భారతీయ రైల్వే చరిత్రలోనే హౌరా రైల్వే స్టేషన్ కు ప్రముఖ స్థానం ఉంది. దేశంలోనే తొలిసారిగా 1854 లో హౌరా నుంచి హూగ్లీకి రైల్వే సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అలా హౌరా.. భారతీయ రైల్వే చరిత్రలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది. అలా కాలానుగుణంగా ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి పధంలోకి వచ్చింది. ఇప్పుడు అత్యాధునిక వసతులతో ఈ రైల్వే స్టేషన్ ను తీర్చి దిద్దారు. హౌరా రైల్వే స్టేషన్ బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. దానివల్ల స్టేషన్ బిల్డింగ్ అప్పటి డిజైన్, స్టైల్ ను గుర్తుకు తెస్తుంది. స్టేషన్ బిల్డింగ్ ను అప్పటి బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హాల్సే రికార్డో డిజైన్ చేశారు. ఎర్ర ఇటుకలను ఉపయోగించి ఈ స్టేషన్ నిర్మాణం పూర్తి చేశారు. విక్టోరియన్, గోతిక్ స్టైల్ ఈ బిల్డింగ్ లో మనకు కనిపిస్తుంది.

Do You Know India s BUSIEST Railway Station

హౌరా రైల్వే స్టేషన్ హూగ్లీ నది ఒడ్డునే ఉంది. ఈ స్టేషన్ హౌరా బ్రిడ్జితో కోల్ కతా నగరానికి కనెక్ట్ అవుతుంది. హౌరా బ్రిడ్జి.. దేశంలోనే ప్రముఖ ప్రదేశాల్లో ఒకటిగా ఉంది. ఈ బ్రిడ్జి కోల్ కతాలోని అన్ని బిజినెస్ సెంటర్లను అనుసంధానంగా ఉంది. ఈ స్టేషన్ నుంచి రోజూ 600 రైళ్లు వివిధ ప్రాంతాలకు ప్రయాణం సాగిస్తుంటాయి. రోజూ దాదాపు 10 లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+