నేతల వీఐపీ సంస్కృతిపై మోడీకి డాక్టర్ల ఫిర్యాదు- ట్రీట్‌మెంట్‌కు ఇంటికి రావాలని టార్చర్‌

దేశవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న రాజకీయ నేతల వీఐపీ సంస్కృతి డాక్టర్లకు ఇబ్బందికరంగా మారుతోంది. కరోనా ట్రీట్‌మెంట్‌ కోసం ఇంటికి రావాలంటూ ప్రభుత్వ వైద్యులకు రాజకీయ నేతలు బెదిరించడాన్ని అఖిల భారత వైద్య సంఘం(ఫైమా) తప్పుబట్టింది. ఈ మేరకు నేతల వీఐపీ సంస్కృతిపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసింది.

కరోనా వైరస్‌తో ఆస్పత్రుల్లో చేరుతున్న వీఐపీలు తమను ఇంటికి వచ్చి చికిత్స చేయాలని వేధిస్తున్నట్లు డాక్టర్ల సంఘం ప్రధాని మోడీకి చేసిన ఫిర్యాదులో పేర్కొంది. ఓవైపు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా ఉన్న తమకే ఆస్పత్రులో పూర్తి స్దాయిలో సదుపాయాలు లేవని, తమ ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ రాజకీయ నేతలకు, వారితో పాటు ఉండే కార్యకర్తలకు చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఆస్పత్రుల్లో వీఐపీలకు ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయని, కానీ డాక్టర్లకు మాత్రం లేవని వారు తెలిపారు.

doctors complain pm modi against politicians vip culture over calling for home treatment

చాలా మంది రాజకీయ నేతలు, వీఐపీలు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోయినా తమను ఇళ్లకు వచ్చి చికిత్స అందించాలని డిమాండ్ చేస్తున్నారని డాక్టర్ల సంఘం ప్రధానికి రాసిన లేఖలో పేర్కొంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోనే రోజుకు 90 వేల కేసులు బయటపడుతున్నాయి. ఇందులో చాలా మంది రాజకీయ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఉంటున్నారు. కానీ వీరికి చికిత్స అందించేందుకు ఆస్పత్రుల్లో సదుపాయాలు లేవని డాక్టర్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఇళ్లకు వచ్చి చికిత్స చేయాలని వారి నుంచి ఒత్తిడి ఎదురవుతున్నట్లు ప్రధానికి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+