ఆర్టికల్ 370 దెబ్బ ? కశ్మీర్ లోయలో సగం సీట్లకు కూడా పోటీ చేయని బీజేపీ..!

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలో అధికార బీజేపీకి సంకటంగా మారాయి. ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్లో ఉగ్రవాదాన్ని రూపుమాపామని పైకి చెప్పుకుంటున్న బీజేపీ.. త్వరలో అక్కడ జరిగే ఎన్నికల్లో అన్ని సీట్లలో పోటీ చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. ముఖ్యంగా ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉండే కాశ్మీర్ లోయలో కనీసం సగం సీట్లలో కూడా పోటీ చేయడం లేదు. దీంతో కాషాయ నేతలు పైకి చెబుతున్న మాటలకూ, క్షేత్రస్ధాయిలో పరిస్ధితులకూ పూర్తిగా తేడా ఉందని అర్థమవుతోంది.

జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. ఇందులో జమ్మూ ప్రాంతంలో 43 సీట్లు ఉంటే కాశ్మీర్ లోయలో మాత్రం 47 సీట్లు ఉన్నాయి. ఇందులో జమ్మూ ప్రాంతంలోని 43 సీట్లకు అభ్యర్ధుల్ని ప్రకటించిన బీజేపీ.. కాశ్మీర్ లోయకు వచ్చే సరికి మాత్రం కేవలం 19 సీట్లకే అభ్యర్ధుల్ని ప్రకటించింది. అంతే కాదు ఇక్కడ మిగతా సీట్లలో పోటీ చేయడం లేదని కూడా తేల్చిచెప్పేసింది. దీంతో కాశ్మీర్ లోయలో పోటీకి బీజేపీ ఎందుకు అంత భయపడుతుందనే చర్చ జరుగుతోంది.

does bjp lost hope on Kashmir valley contesting only in 19 seats out of 47

అయితే జమ్మూలో పోటీ చేస్తున్న 43 సీట్లు, కాశ్మీర్ లోయలో పోటీ చేస్తున్న 19 సీట్లూ కలుపుకుంటే బీజేపీ ఈసారి ఎన్నికల్లో మొత్తం 62 సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్నట్లయింది. మిగిలిన 27 సీట్లపై ఆశలు వదులుకుంది. గతంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లో పరిస్ధితులు పూర్తిగా తమకు అనుకూలంగా మారాయని చెప్పుకున్న బీజేపీ ఇప్పుడు ఎందుకు పోటీకి ముందుకు రావడం లేదనే చర్చ మొదలైంది.

కొందరు బీజేపీ నేతల వాదన ప్రకారం ఆ 27 సీట్ల సంగతి పక్కనబెడితే ప్రస్తుతం అభ్యర్ధుల్ని నిలబెట్టిన 19 సీట్లలోనూ గెలుపు ఆశల్లేవని చెబుతున్నారు. వీరిని కేవలం డమ్మీ అభ్యర్ధులుగానే నిలబెట్టినట్లు వారు అంతర్గత చర్చల్లో చెప్పుకుంటున్నారు.
మరి జమ్మూకశ్మీర్ లో అధికారం సాధించడం ఎలా అని అడిగితే జమ్మూలో నిలబెట్టిన అందరు అభ్యర్ధుల్ని గెలిపించుకోవడం లేదా మెజార్టీ అభ్యర్ధుల్ని గెలిపించుకుంటే మ్యాజిక్ మార్కుకు అవసరమైన 46 సీట్లకు కొందరు స్వతంత్రుల్ని కలుపుకోవచ్చని భావిస్తోందట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+