వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: లేడీ టెక్కీలకు నైట్ షిఫ్టులు వద్దు, కారణమిదే!

రాత్రివేళల్లో మహిళలకు ఆయా కంపెనీల్లో బాధ్యతలు అప్పగించరాదని కర్ణాటక ప్రభుత్వ ప్యానెల్ స్పష్టం చేసింది.మహిళల భద్రత రీత్యా ఈ మేరకు ప్రభుత్వ ప్యానెల్ ఐటీ కంపెనీలకు ఆధేశాలు జారీ చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: రాత్రివేళల్లో మహిళలకు ఆయా కంపెనీల్లో బాధ్యతలు అప్పగించరాదని కర్ణాటక ప్రభుత్వ ప్యానెల్ స్పష్టం చేసింది.మహిళల భద్రత రీత్యా ఈ మేరకు ప్రభుత్వ ప్యానెల్ ఐటీ కంపెనీలకు ఆధేశాలు జారీ చేసింది.

ఐటీ రంగంలో, బయోటెక్నాలజీ రంగంలో రాత్రి వేళల్లో మహిళలకు షిఫ్ట్ లు వేయకూడదని సూచించింది. వారి భద్రతకు, వ్యక్తిగత స్వేఛ్చకు ఎలాంటి భంగం కలగకుండా ఉండాలంటే బెంగుళూరులోని ఏ కంపెనీ కూడ మహిళలకు రాత్రిపూట విధులు అప్పగించరాదని స్పష్టం చేసింది.

don't assign night duty to women: Karnataka house panel to I.T. companies

మహిళ సంరక్షణ చిన్నారుల సంక్షేమంపై కర్ణాటక ప్రభుత్వం ఓ శాసనసభ కమిటీని వేసింది.దీనికి ఎన్ ఏ హ్యారిస్ అధ్యక్షుడిగా ఉన్నారు. అన్ని కోణాల్లో పరిశీలించిన ఈ కమిటీ చివరకు ఐటీ , బీటీ రంగాల్లో మహిళలకు విధులు రాత్రి వేళల్లో అప్పగించరాదని సూచించింది.

ఆయా కంపెనీలు మహిళలకు ఉదయం లేదా మధ్యాహ్నం వేళల్లో మాత్రమే పనులను అప్పగించాలని సూచించింది. గత ఏడాది సెప్టెంబర్ 9వ, తేదిన ఈ కమిటీ బెంగుళూరులోని ఇన్పోసిస్ , బైకాన్ వంటి కంపెనీలకు వెళ్ళి అభిప్రాయాలను సేకరించి ఈ ప్రతిపాదనలను చేసింది.

English summary
a legislature panel has recommended that information technology and bio-technology companies in bengaluru should avoid assigning night shifts to women to ensure their safety, security and privacy needs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X