వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'లక్ష్మణ రేఖ'ను దాటొద్దు: బీజేపీ ఎంపీలకు ప్రధాని మోడీ హెచ్చరిక

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బహిరంగ సభలు, సమావేశాల్లో ప్రసంగించేటప్పుడు ప్రజా ప్రతినిధులు 'లక్ష్మణ రేఖ'ను దాటరాదని ప్రధాని మోడీ హెచ్చరించారు. ఈ ఉదయం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎంపీలంతా వివాదాస్పద వ్యాఖ్యల జోలికి పోకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా జాతిపిత మహాత్మ గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించిన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌పై ప్రధాని మోడీ గట్టిగా మందలించారు.

అలాంటి వ్యాఖ్యలు చేసే నేతలకు కళ్లెం వేయాల్సిందిగా బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్‌ఎస్‌ఎస్‌ను కోరినట్లు సమాచారం. కాగా, శుక్రవారం సాక్షి మహారాజ్‌. తన వ్యాఖ్యలపై లోక్‌సభలో క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.

'Don't Cross Laxman Rekha': PM Modi's Warning to BJP Lawmakers

ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన మత మార్పిడిలపై పార్లమెంట్‌ దద్దరిల్లింది. ఐనా సరే బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాధ్ బహిరంగ సభల్లో మత పరమైన విషయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. ఇక ఢిల్లీలో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతీ వ్యాఖ్యలపై ప్రధాని మోడీని విపక్షాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి.

దీంతో పార్లమెంటుకు, పార్టీ సమావేశాలకు ఆలస్యంగా వస్తున్న ఎంపీలకు ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు ఉదయం సైతం చాలామంది ఎంపీలు, మంత్రులు పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ఆలస్యంగా రాగా, మోడీ ఒకింత సీరియస్ అయినట్టు సమాచారం.

English summary
Prime Minister Narendra Modi has reportedly told BJP lawmakers that controversial statements made by some of them are hurting the party and government's image and that no one must cross the line or the "Laxman Rekha."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X