ఏపీ, తెలంగాణ గొడవలోకి మమ్మల్ని లాగొద్దు: 'కృష్ణా'పై కర్నాటక

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆస్తులు, అప్పులు ఎలా పంచుకుంటున్నారో అదేవిధంగా ఉమ్మడి ఏపీలోని కృష్ణా జలాల పంపకం కూడా జరగాలని కర్నాటక ప్రభుత్వం సూచించింది. బుధవారం బ్రిజేష్ ట్రైబ్యునల్ ముందు కర్నాటక తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

కృష్ణా నదీ జలాల పంపిణీ సమస్యను ఆంధ్ర, తెలంగాణకు పరిమితం చేయాలే తప్ప దీనిలోకి తమను లాగొద్దని కర్నాటక సర్కారు ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 89వ సెక్షన్ ప్రకారం కృష్ణా నదీ జలాలను పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకూ మళ్లీ కేటాయించాలా? లేక కేవలం కొత్తగా ఏర్పడిన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలా? అనే అంశంపై న్యాయమూర్తి బ్రిజేష్ కుమార్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన కృష్ణా ట్రిబ్యునల్ విచారణ ప్రారంభించింది.

ప్రాజెక్టుల వారీగా పంపకాల ప్రక్రియ, విధి, విధానాలు, పరిధి నిర్ధారణపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, కేంద్ర జలవనరుల శాఖ తమ అభిప్రాయాలను తెలియజేస్తూ అఫిడవిట్లు, కౌంటర్లను దాఖలు చేశాయి. బుధవారం కర్నాటక ప్రభుత్వం ట్రైబ్యునల్ ముందు తమ వాదనలను వినిపించింది. ట్రైబ్యునల్ రేపు, ఎల్లుడి నాలుగు రాష్ట్రాల వాదనలు విన్న తరువాత తమ పరిధి, విధి విధానాలను ఖరారు చేస్తుంది.

Don't drag Maharashtra and Karnataka: Karnataka lawyer before Brijesh Kumar Tribunal

అయితే కర్నాటకతోపాటు మహారాష్ట్ర కూడా తమను ఆంధ్రా, తెలంగాణ వివాదంలోకి లాగరాదని స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన చట్టం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి జలాల పంపిణీ వివాదాన్ని ఈ రెండు రాష్ట్రాలకు పరిమితం చేయాలి తప్ప తమకు జరిగిన కేటాయింపుల గురించి కాదని కర్నాటక తరపు సీనియర్ న్యాయవాది అనిల్ దివాన్ వాదించారు.

బ్రిజేష్ ట్రిబ్యునల్ కృష్ణా నదీ జలాలను మహారాష్ట్ర, కర్నాటక, అవిభాజిత ఆంధ్రప్రదేశ్‌లకు కేటాయించటం తెలిసిందే. అయితే ఏపీ విడిపోయి రెండు రాష్ట్రాలు ఏర్పాటు కావటంతో కృష్ణా జలాలను మళ్లీ కేటాయించవలసిన అవసరం వచ్చింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 89వ సెక్షన్ ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను రెండు కొత్త రాష్ట్రాల మధ్య చేయాలి తప్ప కర్నాటక, మహారాష్ట్రలను కలపకూడదని కర్నాటక తరఫు లాయర్ స్పష్టం చేశారు.

హైకోర్టు, సచివాలయ భవనాలు పంచుకున్నట్లే నీటి కేటాయింపులు కూడా పంచుకోవాలి తప్ప పక్క రాష్ట్రాలను తమ వివాదంలోకి లాగవద్దన్నారు. శుక్రవారం వరకు నిర్వహించే ట్రైబ్యునల్ సమావేసంలో కర్నాటక తర్వాత మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణలు తమ వాదనలు వినిపిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+