వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైళ్ల అనుమతి వద్దేవద్దు..!పునరాలోచించండి..! వీడియో కాన్ఫరెన్స్ లో మోడీతో వాదించిన కేసీఆర్..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : నేడు వివిధ రాష్ట్రల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో విచిత్ర పరిణామాలు చోటుచేసున్నట్టు తెలుస్తోంది. గతంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కేవలం ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రదాని తాజాగా నేడు జరిగిన సమీక్షలో అందరికి మాట్లాడే అవకాశం కల్పించారు ప్రదాని మోదీ. కాగా ప్రధాని మోదీ ఇస్తున్న మినహాయింపుల పట్ల అటు వెస్టు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెరర్జీ ఇటు తెలంగాణ ముఖ్యమంత్ర చంద్రశేఖర్ రావు అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

వివిధ రాష్ట్రాల సీఎంలో ప్రధాని వీడియో సమీక్ష.. తాజా సమాచారం తెలుసుకున్న మోదీ..

ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైళ్ల పునరుద్దరణ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రైలు ప్రయాణం చేసే ప్రయాణీకులు వేల సంఖ్యలో ఉంటారు కాబట్టి వ్యాధి ఎవరికి ఏ స్దాయిలో ఉంటుందో కనిపెట్టడం కష్టంతో కూడుకున్న కార్యక్రమం కాబట్టి, అందరికి పరీక్షలు నిర్వహించడం కూడా చాల వ్యయప్రయాసలతో కూడుకున్న అంశమని వీడియో సీమీక్షలో పాల్గొన్న చంద్రశేఖర్ రావు సూచించినట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గలేదని, ఇలాంటి తరుణంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రజారవాణా వ్యవస్థల పునరుద్దరణలో తొందరపాటు నిర్ణయాలు ఉండకూడదని సూచించారు చంద్రశేఖర్ రావు.

రైళ్ల పునరుద్దరణకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ .. అభ్యంతరం వ్య క్తం చేసిన వివిధ రాష్ట్రాలు..

ఒకవైపు భారత దేశంలో కేసులు ఊహించిన దానికన్నా విసృతంగా పెరుగుతున్నాయని,. కరోనా పాజిటీవ్ కేసుల పమోదులో భారతదేశం నాలుగువ స్థానానికి ఎగబాకడం దురదృష్టకరమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో కేంద్రం సంచలన, అనూహ్య నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎల్లుండి నుంచి భారతీయ రైల్వేలు తిరిగి తమ సేవలు ప్రారంభించడానికి అనుమతించింది. అంతేకాదు, ఈ మేరకు రైల్వే శాఖ రిజర్వేషన్ల వివరాలతో ప్రకటన కూడా విడుదల చేసింది. దీనిపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం గమనార్హం.

రైళ్ల పునరుద్దరణ వద్దంటే వద్దు.. పూర్తిగా వ్యతిరేకించిన తెలంగాణ సీఎం..

దేశ రాజధాని ఢిల్లీ నుంచి 15 రైళ్లను దేశంలోని ముఖ్యనగరాలకు నడపనుంది. ఎల్లుండి నుంచి ఈ రైల్వే సర్వీసులు సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఇందుకు సంబంధించిన ముందస్తు బుకింగ్ కూడా మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి అందుబాటులో ఉంటుందని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణకుల ఆరోగ్యం కాపాడుకుంటూనే తన సేవలను రైల్వే అందించనుంది. సరిగ్గా ఇదే నిర్ణయం పట్ల వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుండి మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయినట్టు తెలుస్తోంది.

రైళ్ల అనుమతి అంత శ్రేయస్కరం కాదు.. మోదీ కి తన అభిప్రాయం చెప్పిన కేసీఆర్..

రైళ్ల అనుమతి అంత శ్రేయస్కరం కాదు.. మోదీ కి తన అభిప్రాయం చెప్పిన కేసీఆర్..

ఇదిలా ఉండగా రాష్ట్రాలు చెల్లించాల్సిన అప్పులపై ఎఫ్ఆర్బీఎం గడువు పొడిగించాలని వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రధాని మోదీ ని కోరినట్టు తెలుస్తోంది. దాదాపు 48రోజులుగా ఆర్దిక లావాదేవీలు స్తంభించిపోవడం, ఆర్ధిక వ్యవస్థ చితికిపోవడం వల్ల మోయలేని భారం మోయాల్సొంస్తుందని, ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం తగు చేయూత అందించాలని ప్రధానిని సీఎం చంద్రశేఖర్ రావు కోరారు. ముఖంగా లాక్‌డౌన్ ఆంక్షలు, మరిన్ని మినహాయింపులు, రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తదితర అంశాలపై ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. రైళ్ల పునరుద్దరణ మాత్రం అంత శ్రేయస్కరం కాదని సీఎం చంద్రశేఖర్ రావు సూచించినట్టు తెలుస్తోంది.

English summary
Telangana Chief Minister Chandrasekhar Rao opposed the decision to revamp trains. Since there are thousands of train passengers in the country, it is a difficult task to ascertain who is at risk for the disease, Chandra Shekhar said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X