మోడీ మాతో ఏమేమో చేయిస్తున్నారు: బిజెపి మంత్రి
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మాతో (బిజెపి నేతలు, మంత్రులు) ఏం చేయిస్తున్నారో మాకే తెలియడం లేదని, తన వ్యాఖ్యలను వీడియోగా తీసి తనను ఇబ్బంది పెట్టవద్దని హర్యానా రాష్ట్ర మంత్రి క్రిషన్ కుమార్ బేడీ అన్నాడు. ఇది ఇంటర్నెట్లో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.
సాధారణంగా రాజకీయ నాయకులు... ఇలా ప్రజల్లోకి వెళ్లి అలా హామీలు ఇచ్చి, ఆ తర్వాత తమకు తోచినప్పుడు ప్రజలకు లేదా నియోజకవర్గాల్లో కనిపించేవారు. అయితే, నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక బిజెపి నేతలను నిత్యం ప్రజల్లో ఉండాలని ఆదేశిస్తున్నారు.
దీంతో, బీజేపీ నేతలు పార్టీ కోసం మరింత కష్టపడాల్సి వస్తోంది. దీనికి తోడు స్వచ్ఛభారత్ అంటూ కొత్త నినాదాన్ని అందుకున్నారు. దీంతో ఆ పార్టీ నేతలు కచ్చితంగా ఆ కార్యక్రమంలో పాల్గొనవలసి వస్తోంది.

ఈ నేపథ్యంలో హర్యానా న్యాయశాఖ మంత్రి క్రిషాన్ కుమార్ బేడీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆదివారం ఫతేహాబాద్‌లో ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... మోడీ మాతో ఏమేమో చేయిస్తున్నాడంటూ నిట్టూర్చారు. ఇది సోషల్ మీడియాలో బాగా కనిపిస్తోంది. దీనిపై ఆయన వివరణ ఇస్తూ... మోడీ చెప్పారనే కారణంగానే అధికారులు బలవంతంగా చీపుర్లు పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, అది సరికాదని చెప్పేందుకే ఆ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. హర్యానా పరిశుభ్రంగానే కాకుండా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.












Click it and Unblock the Notifications