బీజేపీకి మద్దతివ్వం: సేన, ఒకే వేదికపై రాజ్, ఉద్ధవ్‌లు

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో బీజేపీపై శివసేన మరోసారి ఘాటుగా స్పందించింది. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఆ పార్టీ వమ్ము చేసిందంటూ విరుచుకపడింది. మహారాష్ట్రలో తిరిగి భారతీయ జనతా పార్టీతో కలిస్ ఆలోచన లేదని, భవిష్యత్తులో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ.. బీజేపీకి మద్దతు ఉపసంహరించినా తమ పార్టీ మద్దతివ్వదని తేల్చి చెప్పింది.

అసెంబ్లీ విశ్వాస పరీక్ష సమయంలో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఆ పార్టీ వమ్ము చేసిందని సోమవారం నాటి సామ్నా పత్రిక సంపాదకీయంలో విమర్శించింది. గతంలో బీజేపీతో తాము మంచి సంబంధాలను నడిపినా ఇప్పుడు వాటిని పునరాలోచించుకోవడం లేదని ప్రకటించింది. గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్, ఎన్‌సీపీలు రాష్ట్రాన్ని దోచుకున్నాయని... ఇప్పుడు ఎన్‌సీపీ, బీజేపీలు కలిసి ఆ పని చేస్తున్నాయని ఆరోపించింది.

మరాఠా ప్రజలు మార్పు కోరుతూ బీజేపీకి మద్దతిస్తే ఎన్సీపీతో బంధం పెట్టుకొని ఆ పార్టీ ప్రజలను మోసం చేసిందని పేర్కొంది. 63 మంది ఎమ్మెల్యేలతో మహారాష్ట్రను కలిపి ఉంచడంతో పాటు.. రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు తోడ్పాడు ఉంటుందని తెలిపింది.

శివాజీ పార్కులో ఆ పార్టీ వ్వవస్ధాపకుడు బాలాసాహెజ్ థాకరే రెండవ వర్ధంతిని పురస్కరించుకుని భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టడంతో పాటు.. శివసేన సత్తాను చాటాలని ప్లాన్ చేసింది. ఐతే ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరవుతారా అనే దానిపై స్పష్టత లేదు.

Don't pin any hopes on us in future: Sena tells BJP

ఇటీవల హైడ్రామా నడుమ మహారాష్ట్ర అసెంబ్లీలో.. దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మూజువాణి ఓటుతో విశ్వాస పరీక్ష నెగ్గిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 122 మంది సభ్యుల ఉండగా... పూర్తి స్థాయి మెజారిటీ కోసం ఇంకో 23 మంది సభ్యుల మద్దతు అవసరమైంది.

63 స్థానాల్లో విజయం సాధించి సభలో అతిపెద్ద రెండో పార్టీగా అవతరించిన శివసేన ప్రతిపక్షంలో కూర్చోగా... బీజేపీ సర్కారుకు 41 మంది సభ్యులున్న ఎన్‌సీపీ బయట నుంచి మద్దతిచ్చిన విషయం తెలిసిందే.

బాల్ థాకరే వర్ధంతి సభలో ఒకే వేదికపై రాజ్, ఉద్ధవ్

సోమవారం ముంబైలో శివసేన వ్యవస్ధాపకుడు, ఉద్ధవ్ థాకరే తండ్రి బాలాసాహెబ్ థాకరే వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఇద్దరూ ప్రక్కపక్కనే కూర్చున్నారు. ఐతే మాట్లాడుకుండా ఫోటోలకు మాత్రం ఫోజులిచ్చారు.

శివసేన అధ్యక్షుడిగా ఉద్దవ్‌ను నియమించడంతో 2005లో విభేదాలతో రాజ్ థాకరే పార్టీని వీడి మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీని ఏర్పాటు చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన 13 స్ధానాలు గెలుపొందగా... ఈ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే సాధించి ఘోర పరాజయం చవిచూసింది.

ఇక శివసేన విషయానికి వస్తే బీజేపీతో 25ఏళ్ల మైత్రి బంధాన్ని తెగదెంపులు చేసుకుని ఒంటరిగా పోటీ చేసి 63 స్ధానాల్లో గెలుపొందింది. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ 122 స్ధానాలను కైవసం చేసుకుని మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

బాలాసాహెబ్ థాకరేకు ప్రధాని మోడీ ఘన నివాళి

శివసేన వ్యవస్ధాపకుడు బాలాసాహెబ్ థాకరే 2వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు నివాళులర్పించారు. "నిత్యం ప్రజల కోసమే జీవించిన గొప్ప వ్యక్తి

అయిన బాలాసాహెబ్ థాకరేకు నేను హృదయపూర్వకంగా, సగర్వంగా నివాళులర్పిస్తున్నాను" అంటూ ఆస్టేలియా పర్యటనలో ఉన్న తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>The life of Pujya Balasaheb Thackeray continues to inspire us. He lives in the hearts of millions.</p>— Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/status/534087161746702336">November 16, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>On Pujya Balasaheb Thackeray's Punya Tithi, I salute the great man who always lived for the people & stood for their well-being.</p>— Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/status/534086927796826112">November 16, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+