అమెరికాలో ఎలా గెలిచానో.. ఆదిత్యనాథ్ అలాగే: ట్రంప్ ట్వీట్ చేసినట్లు..

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్/లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లుగా ఉన్న ఓ ఫేక్ ట్వీట్ నెట్లో వైరల్ అవుతోంది.

గోరఖ్‌నాథ్ మఠానికి ప్రధాన పీఠాధిపతిగా ఉన్న యోగి... ఉత్తర ప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేసి భారత్‌లోని అతిపెద్ద రాష్ట్రానికి పాలకుడు అయ్యారు. ఈ నేపథ్యంలో యోగిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది.

yogi adityanath

కొందరు నెటిజన్లు అయితే తమ సృజనాత్మకతను రంగరించి ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. యోగి ఎన్నికపై స్పందించినట్లు ట్వీట్లు రూపొందించారు.

తాను అమెరికా ఎన్నికల్లో గెలవడం ఎలా జరిగిందో.. యూపీలో కూడా యోగి యోగి ఆదిత్యనాథ్ దుమ్ముదులిపేశారంటూ ట్రంప్ కొనియాడినట్లు అమెరికా అధ్యక్ష ట్విటర్ ఖాతా నుంచి ఓ ట్వీట్ పెట్టినట్లు నెటిజన్లు సృష్టించారు. అంతేకాకుండా యోగికి అభినందనలు తెలిపినట్లుగా కూడా ట్వీట్‌ను ఫోటోషాప్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Donald Trump's Fake Tweet Congratulating UP CM Yogi Adityanath Sparks A Laugh Riot.
Please Wait while comments are loading...