సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నారు
సోషల్‌మీడియాను దుర్వినియోగం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని కొంతమంది సోషల్‌మీడియాను దుర్వినియోగపాలు చేస్తున్నారని అన్నారు. ఈ మధ్యకాలంలో ప్రతిఒక్కరూ సోషల్ మీడియాను వాడుతున్నారు. సోషల్ మీడియా గురించి తెలియని వారే లేరు. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరికీ సోషల్‌మీడియా గురించి తెలుసా. ఎలా వాడాలో తెలుసు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కరోజూ కూడా సోషల్‌మీడియాను వినియోగించకుండా ఉండలేని పరిస్థితి నేటికీ నెలకొంది.
సామాజిక మాధ్యమాల్లో మునిగితేలుతున్నారు..:ముఖ్యంగా చాలామంది యువత నిత్యం ఫేస్‌బుక్, వాట్సాఫ్‌లంటూ గంటల తరబడి సమయం కేటాయిస్తున్నారు. కొందరైతే ఉదయం లేచిన దగ్గరనుంచి అర్థరాత్రి వరకూ స్మార్ట్‌ఫోన్లతో కాలం గడిపేస్తున్నారు. ఈ సోషల్ మీడియాల్లో ట్విట్టరు, ఇన్‌స్టాగ్రామ్, యూటూబ్ వీటిల్లోనే నేటి యువత ఎక్కువగా మునిగితేలుతున్నారు. అయితే, కొందరు ఈ సామాజిక మాధ్యమాలని ప్రపంచంలో, దేశంలో ఏం జరుగుతుందోనే అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, వీటిలో ఫేక్‌న్యూస్‌లు కూడా అప్పుడప్పుడు మనకు దర్శనమిస్తుంటాయి. వాటి గురించి కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకొనే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు. సరికదా. చూసిన వాటినే నిజమని నమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయనెందుకు సోషల్‌మీడియాపై విరుచుకుపడ్డారో ఇప్పుడు చూద్దాం.

నూతన కార్యాలయ ప్రారంభం..:త్రికరిపూర్‌లో పార్టీ నూతన కార్యాలయ ప్రారంభానికి పినరయ్ విజయన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అందుకు కారణం.. ఇరవై ఆరేళ్ల కాంగ్రెస్ కార్యకర్త ఒకరు సిపిఎం పార్టీకి చెందిన సీనియర్ నేతల కుటుంబంలోని మహిళలను సోషల్‌మీడియాలో తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. అసభ్యకరమైన ఫోటోలను షేర్ చేస్తున్నాడు. ఆ కార్యకర్త తిరువనంతపురంలోని పరశాలకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. అయితే, కొంతమంది రాజకీయ కక్షతోనే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని కేరళ సిఎం విరుచుకుపడ్డారు.

నాగరికతను కోల్పోకూడదు..:ఈ విషయంపై కేరళ ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. సామాజిక మాధ్యమాలను వినియోగించేటప్పు నాగరికతను కోల్పోకూడదని హితబోధ చేశారు. ఇతరులను వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మన చర్యలు ఉండకూడదంటూ సూచించారు. ప్రత్యర్థులను లక్ష్యంగా పెట్టుకుని కొంతమంది నేతలు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ, మహిళలను వేధిస్తున్నారని ఆరోపించారు. సోషల్‌మీడియాను దుర్వినియోగం చేయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కకపోవడం వల్ల ఇలాంటి ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే ఇలాంటి చర్యలను సహించకూడదని తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు.
-
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
ఈ ఫోటోలో ఉన్న గుడ్లగూబను కనిపెట్టగలరా..? -
ఈ ఫోటోలో ఎన్ని జంతువులు ఉన్నాయో చెప్పగలరా..? -
నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం.. -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !!












Click it and Unblock the Notifications