Doute: ఆఫీసులో భర్తతో ? పిల్లలను సుత్తితో కొట్టి చంపేశాడు, భార్య చనిపోయిందని భర్త ఆత్మహత్య !
రాయ్ పూర్/ ఛత్తీస్ గడ్: సంతోషంగా పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న భర్త ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంచి ఉద్యోగం చేస్తున్న భర్త భార్య, పిల్లలను బాగానే చూసుకుంటున్నాడు. భర్త ఉద్యోగం చేస్తున్న ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న యువతి తన మొగుడితో చాలా క్లోజ్ గా ఉంటున్నదని భార్యకు తెలిసింది. ఇదే విషయంలో చాలాకాలం నుంచి దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. ఆమె తనసాటి ఉద్యోగి అని, ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదని భర్త పదేపదే అతని భార్యకు చెబుతున్నాడు. ఇదే సమయంలో ఆఫీసులో పని చేస్తున్న మహిళా ఉద్యోగి రైల్వేస్టేషన్ లో శవమై కనిపించింది. తరువాత దంపతుల మద్య ఇంకా గొడవలు ఎక్కువ అయ్యాయి. రాత్రి సహనం కోల్పోయిన భర్త సుత్తి తీసుకుని భార్య, ఇద్దరు పిల్లల తలల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. ఇద్దరు పిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తరువాత భర్త డెత్ నోట్ రాసి ఆరు అంతస్తుల భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే భార్య చనిపోయిందని భర్త ఆత్మహత్య చేసుకోవడంతో అతని భార్య ప్రాణాలతో భయటపడింది.

ఉద్యోగి హ్యాపీలైఫ్
ఛత్తీస్ గఢ్ లోని నవరాయ్ పూర్ లో 32 ఏళ్ల నీరజ్ రాయ్, 28 ఏళ్ల స్వప్నా రాయ్ ( ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. సంతోషంగా పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న భర్త నీరజ్ రాయ్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. నీరజ్ రాయ్, స్వప్నా రాయ్ దంపతులకు ఏడు సంవత్సరాల కూతురు, మూడు సంవత్సరాల కొడుకు ఉన్నారు. మంచి ఉద్యోగం చేస్తున్న నీరజ్ రాయ్ అతని భార్య, పిల్లలను బాగానే చూసుకుంటున్నాడు.

భర్త ఆఫీసులో స్టెనోగ్రాఫర్ మీద అనుమానం
నీరజ్ రాయ్ ఉద్యోగం చేస్తున్న ఆఫీసులో స్టెనోగ్రాఫర్ గా ఉద్యోగం చేస్తున్న యువతి తన మొగుడితో చాలా క్లోజ్ గా ఉంటున్నదని అతని భార్య స్వప్నా రాయ్ కి తెలిసింది. ఇదే విషయంలో చాలాకాలం నుంచి నీరజ్ రాయ్, స్వప్నా రాయ్ దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. ఆమె తనసాటి ఉద్యోగి అని, ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదని నీరజ్ రాయ్ పదేపదే అతని భార్య స్వప్నాకు చెబుతున్నాడు.

రైల్వేస్టేషన్ లో శవమైయ్యింది
నీరజ్ రాయ్ ఆఫీసులో స్టెనోగ్రాఫర్ గా ఉద్యోగం చేస్తున్న యువతి నెల రోజుల క్రితం రాయ్ పూర్ రైల్వేస్టేషన్ లో శవమై కనిపించింది. యువతి శవమై కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో యువతి శవమైన తరువాత నీరజ్ రాయ్, స్వప్నా రాయ్ దంపతుల మద్య గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి.

సుత్తితో భార్య, పిల్లల మీద దాడి చేసిన భర్త
రానురాను భార్య స్వప్నా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీరజ్ రాయ్ సతమతం అయ్యాడు. ప్రతిరోజూ ఇంట్లో ఇదే రామాయణం ఎక్కువ అయ్యింది. ఇటీవల నీరజ్ రాయ్, స్వప్నా దంపతుల మద్య ఇంకా గొడవలు ఎక్కువ అయ్యాయి. రాత్రి సహనం కోల్పోయిన నీరజ్ రాయ్ సుత్తి తీసుకుని భార్య స్వప్నా, కూతురు, కొడుకు తలల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు.

భార్య, పిల్లలు చనిపోయారని ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
నీరజ్ గుప్తా బలంగా సుత్తితో దాడి చెయ్యడంతో అతని ఇద్దరు పిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. స్వప్నా స్పృహ కోల్పోవడంతో ఆమె చనిపోయిందని నీరజ్ రాయ్ అనుకున్నాడు. తరువాత మూడు పేజీల డెత్ నోట్ రాసిపెట్టిన నీరజ్ రాయ్ ఆరు అంతస్తుల భవనం మీద నుంచి కిందకుదూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ చెప్పారు.

నా భార్య ఎక్కువ టార్చర్ పెట్టింది......... అందుకే ?
పదేపదే తన భార్య తన మీద అనుమానం పెంచుకుని సూటిపోటి మాటలతో చిత్రహింసలకు గురి చేసిందని, అందుకే పిల్లలను భార్యను చంపేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని నీరజ్ డెత్ నోట్ లో రాసిపెట్టాడని ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ స్థానిక మీడియాకు చెప్పారు. తలకు తీవ్రగాయాలైన భార్యను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ మీడియాకు చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications