వరకట్నం తీసుకురాలేదని భార్య మర్మాంగం మీద ఐరన్ బాక్స్ తో కాల్చిన కిరాతకుడు!

బెంగళూరు: వరకట్నం తీసుకురాలేదని కోపంతో భర్త కిరాతకుడు అయ్యాడు. ఐరన్ బాక్స్ హీట్ చేసి భార్య మర్మాంగం మీద కాల్చిన దారుణ ఘటన బెంగళూరు నగరంలోని బాణసవాడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాణసవాడిలోని జానకీరామ్ లేఔట్ నివాసం ఉంటున్న దిలీప్ కుమార్ అనే నీచుడిని పోలీసులు అరెస్టు చేశారు.

దిలీప్ కుమార్ భార్యతో కలిసి జానకీరామ్ లేఔట్ లో నివాసం ఉంటున్నాడు. ప్రతినిత్యం భార్యను పుట్టింటికి వెళ్లి నగలు, నగదు తీసుకురావాలని వేధింపులకు గురి చేశాడు. రెండు రోజుల క్రితం రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లిన దిలీప్ కుమార్ భార్యను పుట్టింటికి వెళ్లి నగలు, నగదు తీసుకురావాలని చెప్పాడు.

Dowry harassment Husband attack on his wife In Bengaluru

పుట్టింటి నుంచి నగలు, నగదు తీసుకువస్తే తాను వ్యాపారం చేసుకుంటానని, నీతో కాపురం చేస్తానని ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. పుట్టింటికి వెళ్లి నగదు, నగలు తీసుకురావడానికి ఆమె నిరాకరించింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన దిలీప్ కుమార్ కేబుల్ వైర్ తీసుకుని భార్యను చితకబాదేశాడు.

ఐరన్ బాక్స్ హీట్ చేసి భార్య మర్మాంగం మీద పెట్టడంతో ఆమెకు తీవ్రగాయాలైనాయి. బాధితురాలిని బెంగళూరు నగరంలోని అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో మంగళవారం అతన్ని అరెస్టు చేశామని బాణసవాడి పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+