కోలుకుంటున్న జయలలిత: లండన్ వెళ్లిన రిచర్డ్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారని, ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని అన్నాడీఎంకే వర్గాలు చెప్పాయి. అపోలో, ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో వారం రోజులకు పైగా చేసిన చికిత్సకు జయలలిత ఆరోగ్యం మెరుగుపడిందని అన్నాడీఎంకే నాయకులు అన్నారు.
లండన్ వైద్యుడు రిచర్డ్ వైద్యులకు సూచనలు సలహాలు ఇచ్చారు. డాక్టర్ రిచర్డ్ ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు సింగపూర్ కు చెందిన ఫిజియోథెరఫీ వైద్యులకు జయలలితకు చికిత్స చేస్తున్నారు. లండన్ వైద్యుడు రిచర్డ్ బుధవారం తిరిగి తన స్వదేశానికి బయలుదేరి వెళ్లారు.

సోషల్ మీడియాలో జయలలిత ఆరోగ్యంపై వదంతులు సృష్టించాడనే ఆరోపణలపై బుధవారం తంజావూర్ కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి శిద్దా రాఘవరావు బుధవారం అపోలో ఆసుపత్రికి వచ్చారు.
అయితే ఆయన జయలలితను చూడటానికి రాలేదని, ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చారని తెలిసింది. జయలలిత ఆరోగ్యం కుదటపడాలని, ఆమె దీపావళి పండగకు ముందే ఇంటికి చేరుకోవాలని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆమె అభిమానులు పూజలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications