బళ్లారిలో బీజేపీకి భారీ దెబ్బ, చేతులు ఎత్తేసిన డాక్టర్, గాలి బ్రదర్స్ దిక్కు, రెడ్డి VSరెడ్డి!

Posted By:
Subscribe to Oneindia Telugu

బళ్లారి: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా బళ్లారి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. బళ్లారి నుంచి పోటీ చెయ్యాలని బీజేపీ నాయకులు డాక్టర్ బీకే. సుందర్ కు ఇప్పటికే సూచించారు. అయితే శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని నిర్ణయించిన డాక్టర్ బీకే. సుందర్ చివరి నిమిషంలో మనసుమార్చుకున్నారని తెలిసింది. ఇప్పుడు బళ్లారిలో బీజేపీకి గాలి జనార్దన్ రెడ్డి సోదరులే దిక్కయ్యారని తెలిసింది.

  బళ్లారి లో మినహా అన్ని చోట్ల అభ్యర్దుల జాబితా సిద్దం
  సుష్మాస్వరాజ్, ఆర్ఎస్ఎస్

  సుష్మాస్వరాజ్, ఆర్ఎస్ఎస్

  డాక్టర్ బీకే. సుందర్ కు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, కర్ణాటక బీజేపీ రాష్ట్ర శాఖ అండ పుష్కలంగా ఉంది. అందరూ బళ్లారి నగర శాసన సభ నియోజక వర్గం నుంచి డాక్టర్ బీకే. సుందర్ ను పోటీ చేయించాలని ఇంత కాలం అనుకున్నారు.

  గాలి సోమశేఖర్ రెడ్డి

  గాలి సోమశేఖర్ రెడ్డి

  బీజేపీ అధిష్టానం గాలి సోమశేఖర్ రెడ్డిని పక్కన పెట్టి డాక్టర్ బీకే. సుందర్ వైపు మొగ్గు చూపింది. ఇక ఈ ఎన్నికల్లో తాను పోటీ చెయ్యడానికి అవకాశం ఉండదని గాలి సోమశేఖర్ రెడ్డి మానసికంగా సిద్దం అయ్యారు. అయితే చివరి నిమిషం వరకు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తూ గత వారం బెంగళూరులో జరిగిన స్క్రీనింగ్ టెస్టుకు హాజరైన గాలి సోమశేఖర్ రెడ్డి టిక్కెట్ ఇవ్వాలని అర్జీ సమర్పించారు.

  డాక్టర్ సుందర్ డుమ్మా

  డాక్టర్ సుందర్ డుమ్మా

  బీజేపీ స్క్రీనింగ్ టెస్టుకు డాక్టర్ బీకే. సుందర్ హాజరుకాలేదు. సమావేశం పూర్తి అయ్యేలోపు డాక్టర్ బీకే. సుందర్ వస్తారని గాలి సోమశేఖర్ రెడ్డి అనుచరులు భావించారు. అయితే డాక్టర్ బీకే. సుందర్ మాత్రం స్క్రీనింగ్ టెస్టుకు హాజరుకాకుండా మౌనంగా ఉండిపోయారు.

  చివరి ప్రయత్నం

  చివరి ప్రయత్నం

  బళ్లారి నగర శాసన సభ నియోజక వర్గం నుంచి ఇప్పుడు టిక్కెట్ ఆశిస్తున్న వ్యక్తి గాలి సోమశేఖర్ రెడ్డి మాత్రమే. అయితే బీజేపీ నాయకులు డాక్టర్ బీకే. సుందర్ కు నచ్చచెప్పి ఎన్నికల బరిలోకి దించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.

  రెడ్డి vs రెడ్డి

  రెడ్డి vs రెడ్డి

  బళ్లారి నగర శాసన సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో సూర్యనారాయణ రెడ్డి పోటీ చెయ్యడం దాదాపు ఖరారు అయ్యింది. బీజేపీ నుంచి గాలి సోమశేఖర్ రెడ్డి పోటీ చేస్తే రెడ్డి వర్గం మధ్య ఎన్నికల్లో భారీగా పోటాపోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Dr Sundar reportedly rejected BJP offer to contest from Ballari Assembly constituency. BJP highcommand snubs Gali Reddy gang and offered ticket to new faces with clean image in the society.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X