ఎయిర్ పోర్ట్‌లో డ్రామా: భర్తతో హనీమూన్, ప్రియుడితో లేచిపోయింది

ఢిల్లీ: కొత్తగా పెళ్లైన ఓ జంట హనీమూన్ కోసం వెళ్లింది. హనీమూన్ తర్వాత ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ నూతన దంపతులు దిగారు. అయితే, హఠాత్తుగా ఆ వధువు తన ప్రియుడితో లేచిపోయింది. ఢిల్లీ విమానాశ్రయంలోనే ఈ డ్రామా జరిగింది.

ఢిల్లీ విమానాశ్రయంలో వాష్ రూంకు వెళ్లిన భార్య ఎంత సేపటికీ తిరిగిరాక పోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ చూశాక విషయం తెలుసుకుని భార్యను అసహ్యించుకున్నాడు. భార్యను వదిలేసుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయాడు.

Drama at IGI as woman disappears after returning from honeymoon

ఈ ఘటనకు సంబంధించి సీసీటీపీ ఫుటేజ్ వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే... బాగ్ గోద్రాలో హనీమూన్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఓ జంట ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఆ తర్వాత వాష్ రూంలోకి వెళ్తానని భార్య చెప్పి వెళ్లింది.

బాత్ రూంలో ఓ బురఖా ధరించి బయటకు వచ్చింది. ఆపై వెళ్లి మరో వ్యక్తిని కలవగా, వీరిద్దరినీ ఇంకో వ్యక్తి కలిశాడు. ముగ్గురూ కలిసి టాక్సీల స్టాండ్‌కు వెళ్లి మాయమయ్యారు. ఆమె ప్రియుడు సైతం అదే విమానంలో వచ్చి ఉండవచ్చని, అతనితో ఆమె వెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. దీంతో ఆ భర్త వెళ్లిపోయాడు. బాధితుడు లక్నోకు చెందిన వ్యక్తి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+