వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వామిజీ 'రేప్' కేసులో కొత్త కథ: మర్మాంగం కోయలేదన్న యువతి.. బెదిరింపులే కారణమా?

బాలిక తల్లిదండ్రులను బెదిరింపులకు గురిచేసి ఆమె చేత తప్పుడు వాంగ్మూలం ఇప్పించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును పక్కదోవ పట్టించి తెలివిగా ఇందులోంచి తప్పించుకునేందుకు స్వామిజీ ఈ పథకం పన్ని ఉంటా

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: తనపై అత్యాచారానికి తెగబడ్డ ఓ స్వామిజీ మర్మాంగాన్ని కోసిన యువతిని దేశమంతా మెచ్చుకున్న సంగతి తెలిసిందే. స్వామిజీకి లొంగక ఆ బాలిక ప్రదర్శించిన ధైర్య సాహసాలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. కానీ ఇంతలోనే యువతి మాట మార్చడం గమనార్హం.

స్వామిజీ గంగేశానంద తీర్థపాదకి ఏమి తెలియదని, ఆయన తనకు తండ్రి లాంటి వాడని బాధిత యువతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ నివ్వెరపోయేలా చేస్తోంది. అసలు తాను స్వామిజీ మర్మాంగాన్ని కోయలేదని, పోలీసులే తనపై ఒత్తిడి తెచ్చి అలా చెప్పించారని బాలిక బాంబు పేల్చింది. అంతేకాదు, తనకు అయ్యప్పదాస్ అనే మరో వ్యక్తితో సంబంధముందని బాలిక పేర్కొనడం గమనార్హం.

Gangeshananda

అయ్యప్పదాస్ కు, స్వామిజీకి మధ్య ఆర్థిక వివాదాలున్నాయని బాలిక పేర్కొంది. ఈ మేరకు ఫోన్ సంభాషణ ద్వారా రికార్డు చేసిన బాలిక వాంగ్మూలాన్ని ఓ లేఖతో జతచేసి స్వామిజీ తరుపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ఈ ఫోన్ సంభాషణల్లో బాలిక దాదాపు అరగంట సేపు మాట్లాడింది.

మర్మాంగం కోసేసిన యువతికి సీఎం అభినందన: ఆమె చర్య సాహసోపేతమైనది!..మర్మాంగం కోసేసిన యువతికి సీఎం అభినందన: ఆమె చర్య సాహసోపేతమైనది!..

స్వామిజీపై అనుమానాలు:

బాలిక తల్లిదండ్రులను బెదిరింపులకు గురిచేసి ఆమె చేత తప్పుడు వాంగ్మూలం ఇప్పించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును పక్కదోవ పట్టించి తెలివిగా ఇందులోంచి తప్పించుకునేందుకు స్వామిజీ ఈ పథకం పన్ని ఉంటాడని భావిస్తున్నారు. కేసులో బాధిత యువతి వాంగ్మూలమే కీలకమని అందువల్లే ఆమెపై ఒత్తిడి తెచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయించారని చెబుతున్నారు.

అసలేం జరిగింది?:

ఎర్నాకులం జిల్లా కొల్లాంలోని పద్మనా చట్టంబి స్వామి ఆశ్రమానికి చెందిన గంగేశానంద తీర్థపాద ఓ యువతిపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా లోబరుచుకోవాలని భావించి.. ఓరోజు ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి యత్నించాడు. స్వామిజీపై ఎదురుతిరిగిన యువతి పదునైన కత్తితో విరుచుకుపడింది. ఈ ఘటనలో యువతి స్వామిజీ మర్మాంగాన్ని కోసివేసింది. పోలీసులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

స్వామిజీ ఏమంటున్నాడు?:

స్వామిజీ మర్మాంగాన్ని కోసేసినందుకు సీఎం పినరయి విజయన్ సైతం బాలికను అభినందించడంతో.. స్వామిజీ గంగేశానంద మరో కట్టుకథ అల్లాడు. తన మర్మాంగాన్ని తాన కోసుకున్నానని, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడం వల్లే ఆ పనిచేశానని వింత సమాధానం చెప్పాడు. ఈ మేరకు పోలీసులు అతని వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.

English summary
The 23-year-old woman, who was praised much for taking the extreme step in a bid of self-protection
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X