వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ద్రౌపది ముర్ము వర్సెస్ యశ్వంత్ సిన్హా: కొత్త రాష్ట్రపతి ఎవరు?: ఆ గ్రామంలో పండగ వాతావరణం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడి పీఠం ఎవరిని వరిస్తుందనేది ఇవ్వాళ స్పష్టం కానుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తరపున ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా పోటీ చేశారు. ఈ నెల 18వ తేదీన పోలింగ్ ముగిసింది. ఇవ్వాళ ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు అధికారులు. కౌంటింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌంటింగ్ కొనసాగుతుంది.

ఓటు వేసిన వారు..

ఓటు వేసిన వారు..


పార్లమెంట్ హౌస్‌లోని రూమ్ నంబర్ 63లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీనికోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజ్యసభ సెక్రెటరీ జనరల్ పీసీ మోడీ చీఫ్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తోన్నారు. మొత్తం 4,809 ఎలక్టోర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 776 మంది పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు, 4,033 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 99.18 శాతం మేర పోలింగ్ నమోదైంది. గెలిచిన అభ్యర్థి.. ఈ నెల 25వ తేదీన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం 24న ముగియనుంది.

ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో..

ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో..

దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ సభ్యులు కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఏపీలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓటు వేశారు.

ఏపీ, తెలంగాణ ఇలా..

ఏపీ, తెలంగాణ ఇలా..


ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం.. ఎన్డీఏ అభ్యర్థి వైపే మొగ్గు చూపారు. తెలంగాణ రాష్ట్ర సమితి.. యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది. ద్రౌపది ముర్ముకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. ఎన్డీఏకు సంపూర్ణ బలం ఉండటమే దీనికి కారణం. దీనితో పాటు వైఎస్ఆర్సీపీ, బిజూ జనతాదళ్ వంటి తటస్థ పార్టీలు కూడా ముర్ముకే మద్దతు తెలిపాయి.

ఏపీలో 173 మంది ఓటు..

ఏపీలో 173 మంది ఓటు..

కాగా- ఏపీ శాసనసభలో మొత్తం 175 మంది సభ్యుల బలం ఉండగా.. ఇద్దరు ఓటింగ్‌కు హాజరు కాలేదు. మొత్తంగా 173 ఓట్లు పోల్ అయ్యాయి. గైర్హాజరయిన ఆ ఇద్దరు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులే. హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. సినిమా షూటింగ్‌ల కోసం బాలకృష్ణ విదేశాలకు వెళ్లారు. వ్యక్తిగత పనుల నిమిత్తం బుచ్చయ్య చౌదరి అమెరికా వెళ్లారు.

ద్రౌపది ముర్ము స్వగ్రామంలో..

ద్రౌపది ముర్ము స్వగ్రామంలో..


కాగా- ఈ ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకే విజయావకాశాలు అధికంగా ఉండటం వల్ల ఒడిశాలోని ఆమె స్వగ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తున్నాయి. ఆమె బంధువులు, గ్రామస్తులు స్వీట్లను సైతం సిద్ధం చేసుకున్నారు. పండగ వాతావరణం నెలకొంది. ముర్ము చదువుకున్న పాఠశాలను అందంగా అలంకరించారు. ఈ మధ్యాహ్నానికే విజయం ఎవరిని వరిస్తుందో తేలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
Ruling NDA's Droupadi Murmu and Opposition's Yashwant Sinha are pitted against each other in the contest, with votes clearly stacked in favour of Murmu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X