వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోరాహోరీ ఎన్‌కౌంటర్: కరుడుగట్టిన ఉగ్రవాది లష్కరీ హతం

జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుంచి జరిగిన భారీ ఎన్‌కౌంటర్ ముగిసింది.

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జిల్లాలో శనివారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్ ముగిసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో కరుడు గట్టిన ఉగ్రవాది, లష్కరే తొయిబా కమాండర్ బషీర్ లష్కరీతోపాటు మరో ఉగ్రవాది హతయ్యారు. ఇటీవల ఆరుగురు పోలీసులను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడికి బషీర్ సూత్రధారి కావడం గమనార్హం.

అనంతనాగ్‌ జిల్లాలోని బాట్‌పూర గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కుని భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఆ ఇంటిని చుట్టుముట్టిన భద్రతా దళాలు.. ల‌ష్క‌రే తోయిబా టాప్ క‌మాండ‌ర్ బషీర్ ల‌ష్కరిని మ‌ట్టుబెట్టాయి. మరో ఉగ్రవాది కూడా హతమయ్యాడు.

Dreaded militant Lashkari, two civilians killed in Anantnag encounter in J&K

కాగా, ఉగ్ర కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. మరో 17మంది పౌరులను భద్రతా దళాలు ఉగ్రవాదుల బారి నుంచి కాపాడాయి. కాగా, గ‌తంలో ఉగ్ర‌వాది బషీర్‌పై కాశ్మీర్ పోలీసులు 10 ల‌క్ష‌ల న‌జ‌రానా ప్ర‌క‌టించారు. సోప్‌సాలి కోక‌ర్‌నాగ్ ప్రాంతానికి చెందిన బషిర్ ల‌ష్క‌రి 2015 అక్టోబ‌ర్ 2న ఆ ఉగ్ర‌వాద సంస్థ‌లో చేరాడు.

English summary
The security forces have gunned down Lashkar-e-Tayiba's area commander Bashir Lashkari and his associate Azad Malik at Anantnag in Jammu and Kashmir. The two terrorists were killed following several hours of stand off which was disrupted by locals pelting stones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X