Dream11: డ్రీమ్ 11 ఉద్యోగులకు గుడ్ న్యూస్- లేఆఫ్స్ పై సీఈవో కీలక ప్రకటన..!
ఓవైపు దిగ్గజ ఐటీ సంస్ధలు సైతం ఏఐ వాడకం ప్రారంభించి భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోతపెడుతూ ఉద్యోగుల్ని రోడ్డున పడేస్తున్న వేళ రియల్ మనీ గేమింగ్ సంస్ధ డ్రీమ్ 11 లోనూ లేఆఫ్స్ తప్పవనే చర్చ సాగుతోంది. కేంద్రం తెచ్చిన రియల్ మనీ గేమింగ్ బిల్లు కారణంగా 95 శాతం ఆదాయం కోల్పోయిన డ్రీమ్ 11 దాదాపు సంస్ధను మూసుకోవాల్సిన పరిస్దితుల్లో ఉంది. సాధారణంగా అయితే ఇతర సంస్ధలు అయితే ఉద్యోగుల్ని రాత్రికి రాత్రే సాగనంపేసి కంపెనీలు మూసేసి చేతులు దులుపుకుంటాయి. కానీ డ్రీమ్ 11 మాత్రం అలా ఆలోచించలేదు.
కేంద్రం తెచ్చిన బిల్లు కారణంగా 95 శాతం గ్రూప్ రెవెన్యూలు, 100 శాతం లాభాలు కోల్పోయిన డ్రీమ్ 11 విన్నూత్నంగా ఆలోచిస్తోంది. ఇతర మార్గాల్లో ఆదాయం తెచ్చుకునేందుకు అవకాశాల్ని అన్వేషిస్తోంది. అన్నింటికీ మించి తమ వద్ద ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎవరినీ తొలగించేందుకు సిద్దంగా లేదు. ఈ విషయాన్ని మనీ కంట్రోల్ పోర్టల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా డ్రీమ్ 11 సంస్ధ సహ వ్యవస్ధాపకుడు, సీఈవో కూడా అయిన హర్ష్ జైన్ వెల్లడించారు.

ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్ధితుల నుంచి బయటపడేందుకు డ్రీమ్ 11 3.0కు వెళ్లబోతున్నట్లు హర్ష్ జైన్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రకటనలు, స్పాన్సర్ షిప్, అంతర్జాతీయంగా విస్తరణ, ఏఐ ఆవిష్కరణలపై దృష్టిసారిస్తున్నట్లు వెల్లడించారు. గత ఆర్ధిక సంవత్సరంలో డ్రీమ్ 11 6384 కోట్ల ఆదాయం సంపాదించింది. అంతకు ముందు ఆర్దిక సంవత్సరంలో ఆర్జించిన 3481 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు.

దీంతో తాజా సంక్షోభం నుంచి బయటపడేందుకు డ్రీమ్ స్పోర్ట్స్ ఫ్యాన్‌కోడ్, డ్రీమ్‌సెట్‌గో, డ్రీమ్ గేమ్ స్టూడియోస్ , ఫైనాన్స్-కేంద్రీకృత వెంచర్ డ్రీమ్ మనీతో సహా ఇతర వ్యాపారాలలో దాదాపు 500 మంది ఇంజనీర్లను తిరిగి నియమించాలని భావిస్తోంది. దీంతో ఇంత ఆదాయ సంక్షోభం ఎదుర్కొంటూ కూడా ఉన్న ఉద్యోగుల్ని తొలగించకుండా, గతంలో తీసేసిన ఉద్యోగుల్ని సైతం తిరిగి నియమించుకుని, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లేందుకు డ్రీమ్ 11 చేస్తున్న ప్రయత్నం ప్రశంసలు అందుకుంటోంది.
డ్రీమ్ 11లో అన్ని విభాగాలు కలిపి 1900 నుంచి 2100 మంది ఉద్యోగులు ఉండొచ్చని అంచనా.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications