'యూనివర్సిటీ పేర్లలో హిందూ, ముస్లీం పదాలు తీసేయండి'
బిహెచ్‌యు, ఏఎంయు విద్యాసంస్థల పేర్లలో ఉన్న హిందూ, ముస్లీం మతాన్ని తెలిపే పేర్లను తొలగించాలని యూజీసీకి చెందిన ప్యానెల్ సూచించింది.
ఢిల్లీ: బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అలీగర్ ముస్లీం యూనివర్సిటీ తదితర విద్యాసంస్థల పేర్లలో ఉన్న హిందూ, ముస్లీం మతాన్ని తెలిపే పేర్లను తొలగించాలని యూజీసీకి చెందిన ప్యానెల్ సూచించింది.
బనారస్ హిందూ యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లీం యూనివర్సిటీల నుంచి మత సంబంధమైన పదాలను తొలగించాలని ఆ ప్యానల్ సిఫార్సు చేసింది.

దేశవ్యాప్తంగా పది కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలపై ఆరా తీయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
కేంద్రం నిధులు ఇచ్చే వర్సిటీలు లౌకిక విద్యాసంస్థలని, వీటి పేర్లలో మతాలను తెలిపే పదాలు వద్దని ప్యానల్ చెప్పింది. వీటిని అలీగఢ్ యూనివర్సిటీ, బనారస్ యూనివర్సిటీలుగా పిలువవచ్చునని చెప్పింది. కావాలంటే ఆయా వ్యవస్థాపకుల పేర్లు పెట్టవచ్చునని చెప్పింది.












Click it and Unblock the Notifications