పాకిస్థాన్ నుండి భారత్ కు డ్రగ్స్ బోట్; 200కోట్ల విలువచేసే హెరాయిన్ సీజ్!!

భారతదేశంపై పాకిస్తాన్ కుట్రలు చేస్తూనే ఉంది. భారతదేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను భారతదేశంలోకి పంపే ప్రయత్నం చేయడమే కాకుండా పాకిస్తాన్ నుంచి భారీగా మాదకద్రవ్యాలను భారత్లోకి పంపించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే మాదక ద్రవ్యాలతో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ బోటును గుజరాత్ తీరం జకావ్ నుంచి 33 నాటికల్ మైలు వద్ద కోస్ట్ గార్డు అధికారులు పట్టుకున్నారు.

గుజరాత్ తీరంలో 40కిలోల హెరాయిన్ స్వాధీనం

గుజరాత్ తీరంలో 40కిలోల హెరాయిన్ స్వాధీనం

గుజరాత్‌కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఇండియన్ కోస్ట్ గార్డ్‌తో సంయుక్త ఆపరేషన్‌లో గుజరాత్ తీరంలో అరేబియా సముద్రంలో పాకిస్తాన్ ఫిషింగ్ బోట్ నుండి 200 కోట్ల రూపాయల విలువైన 40 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. భారత జలాల్లో ఆరు మైళ్ల దూరంలో ఉన్న పడవలో ఉన్న పాకిస్థానీ జాతీయులు ఆరుగురు సిబ్బందిని కూడా ఏజెన్సీలు అదుపులోకి తీసుకున్నాయి.

పాకిస్థాన్ కు చెందిన బోట్ ను పట్టుకున్న కోస్ట్ గార్డ్ మరియు ఏటీఎస్ సంయుక్త బృందం

పాకిస్థాన్ కు చెందిన బోట్ ను పట్టుకున్న కోస్ట్ గార్డ్ మరియు ఏటీఎస్ సంయుక్త బృందం

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కచ్ జిల్లాలోని జఖౌ నౌకాశ్రయానికి సమీపంలో కోస్ట్ గార్డ్ మరియు ఏటీఎస్ సంయుక్త బృందం సముద్రం మధ్యలో డ్రగ్స్ తో వెళ్తున్న ఫిషింగ్ బోట్‌ను అడ్డుకుంది. ఇండియన్ కోస్ట్ కార్డు కు చెందిన 2 ఫాస్ట్ ఎటాక్ బోట్లు పాకిస్తాన్ బోట్ ను పట్టుకున్నాయి. గతంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు అనేకం జరిగాయి. మాదకద్రవ్యాల రవాణాకు గుజరాత్ తీరం ప్రాధాన్య మార్గంగా మారినందున, రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మరియు కోస్ట్ గార్డ్ మరియు ఇతర ఏజెన్సీలు గతంలో కూడా ఇటువంటి మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ప్రయత్నాలను ఇప్పటివరకు అనేకం విఫలం చేశాయి.

గతంలోనూ 200 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుకున్న డీఆర్ఐ

గతంలోనూ 200 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుకున్న డీఆర్ఐ

గతంలోనూ గుజరాత్ తీరం మీదుగా భారతదేశంలోకి అక్రమ రవాణా అవుతున్న భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలతో పాటు విదేశీ పౌరులను పట్టుకున్నాయి.
ఇంతకుముందు, కోల్‌కతా పోర్ట్ నుండి స్క్రాప్‌లతో లోడ్ చేయబడిన కంటైనర్ నుండి 200 కోట్ల రూపాయల విలువైన 40 కిలోల హెరాయిన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తో కలిసి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌ నుంచి స్క్రాప్‌లతో కూడిన కంటైనర్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్ రాగా విశ్వసనీయ సమాచారం అందుకున్న యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం డిఆర్ఐతో సంయుక్తంగా దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ అవుతున్న డ్రగ్స్ ను పట్టుకున్నారు.

 గేర్ బాక్సులలో హెరాయిన్ ..

గేర్ బాక్సులలో హెరాయిన్ ..

గుజరాత్ డిజిపి ఆశిష్ భాటియా ప్రకారం, దుబాయ్ బే కు చెందిన ఒక ఎస్ఎస్‌కె జనరల్ ట్రేడింగ్ ఎల్‌ఎల్‌సి ద్వారా సరుకు పంపబడిందని గుర్తించారు రికార్డుల ప్రకారం గేర్ బాక్స్‌లలో దాచిన డ్రగ్ పొట్లాలను స్వాధీనం చేస్తున్నారు. ఏటీఎస్‌, డీఆర్‌ఐ అధికారులు కంటైనర్‌ను తెరిచి చూడగా 36 గేర్‌ బాక్సులు అందులో డజను బాక్సులపై తెల్లటి ఇంక్‌తో గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తు పెట్టెలను తెరిచి చూడగా డెబ్బై రెండు హెరాయిన్ ప్యాకెట్లు కనిపించాయి.

గతంలో గుజరాత్ లోని ముంద్రా పోర్టులో భారీ హెరాయిన్ స్వాధీనం

గతంలో గుజరాత్ లోని ముంద్రా పోర్టులో భారీ హెరాయిన్ స్వాధీనం

ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఆర్‌ఐ, పంజాబ్ పోలీస్, ఎన్‌సిబి మరియు ఢిల్లీ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్‌లో ఎటిఎస్ సముద్ర మార్గం ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్‌ను శోధించారు. మొత్తం 2022లో, గుజరాత్, ఢిల్లీ మరియు కోల్‌కత్తాలో నిర్వహించిన వివిధ దాడులలో మొత్తం 6,800 కోట్ల రూపాయల విలువైన 1300 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 2021 లో గుజరాత్ లో ముంద్రా పోర్టులో కూడా 2988 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో 21 వేల కోట్లుగా ఉందని అంచనా వేయబడింది. ఇక గుజరాత్ తీరానికి జరిగిన అతిపెద్ద డ్రగ్స్ రవాణాలో ఇది ఒకటని అధికారులు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+