Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

drugs case: మళ్ళీ ఎన్సీబీ విచారణకు అనన్య పాండే; అనుమానాస్పద ఆర్ధిక లావాదేవీలతో కేసులో కొత్త కోణాలు

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ చుట్టూనే కాదు, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకుంటున్నట్టు తెలుస్తుంది. అనన్య పాండే ఇంటిపై దాడి చేసి, ఆమె లాప్ ట్యాప్ ను రెండు మొబైల్స్ ను సీజ్ చేసిన అధికారులు ఇప్పటికి రెండుసార్లు ఆమెను విచారించారు. గురువారం అనన్య పాండే ఇంటి పై దాడి చేసిన రోజు విచారణ జరపడమే కాకుండా, శుక్రవారంనాడు కూడా అనన్య పాండేను ఎన్సీబీ అధికారులు నాలుగు గంటల పాటు విచారించారు. మళ్ళీ మరోమారు విచారణకు రావాల్సిందిగా సమన్లు జారీ చేశారు.

అనుమానాస్పద ఆర్దిక లావాదేవీలపై ఎన్సీబీ ప్రశ్నలు

అనుమానాస్పద ఆర్దిక లావాదేవీలపై ఎన్సీబీ ప్రశ్నలు

ఎన్సీబీ కార్యాలయానికి అధికారులు విచారణకు రమ్మని చెప్పిన సమయం కంటే ఆలస్యంగా వెళ్ళిన అనన్య పాండే కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే అక్కడే క్లాస్ పీకారు. ఇది సినిమా షూటింగ్ కాదు మీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి అంటూ అనన్య పాండేతో సమీర్ వాంఖడే అన్నట్టుగా ఎన్సీబీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఎన్సీబీ విచారణలో అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై అనన్య పాండే ను అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన తరువాత అనన్య పాండే తన వద్ద ఉన్న వాట్సాప్ చాటింగ్ లను డిలీట్ చేసినట్లుగా కూడా అనుమానాలున్నాయి. వాట్సాప్ చాటింగ్ లను ఎందుకు డిలీట్ చేశారు అని కూడా అనన్య పాండేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ప్రశ్నించినట్లుగా సమాచారం.

సోమవారం మళ్ళీ ఎన్సీబీ విచారణకు అనన్య పాండే

సోమవారం మళ్ళీ ఎన్సీబీ విచారణకు అనన్య పాండే


ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ సరఫరా చేయడంలో అనన్య పాండే సహకరించిందని, వారిద్దరి మధ్య ఎక్కువగా డ్రగ్స్ చాట్ నడిచిందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మళ్లీ మరోమారు అనన్య పాండేను ప్రశ్నించనున్నట్లుగా సమాచారం. ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ సరఫరా ఎవరు చేశారు అన్నదానిపై అనన్య పాండేను మరోమారు విచారించనున్నట్లు ఎన్సీబీ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ సోమవారం రోజు అనన్య పాండే ఎన్సీబీ విచారణకు హాజరు కావాల్సి ఉందని తెలుస్తుంది.

అనన్య పాండే నుండి సమాచారం రాబట్టే ప్రయత్నంలో ఎన్సీబీ అధికారులు

అనన్య పాండే నుండి సమాచారం రాబట్టే ప్రయత్నంలో ఎన్సీబీ అధికారులు

డ్రగ్స్ కొనుగోలుకు సాయం చేస్తానని ఆర్యన్ ఖాన్ కు అనన్య పాండే చేసిన మెసేజ్ చూపిస్తూ డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారు? ఎలా కొనుగోలు చేశారు? వారికి డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు? వంటి అనేక ప్రశ్నలు సంధించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అనన్య పాండే నుండి సరైన సమాధానం రాబట్టలేకపోయారు. కేవలం ఆర్యన్ ఖాన్ తో జోక్ గా తను అలా చాట్ చేశానని, తాను ఎప్పుడు డ్రగ్స్ వాడలేదని, ఎవరికీ సప్లై చేయలేదని అనన్య పాండే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు చెప్పారు .

అనన్య పాండే విచారణతో కేసులో కొత్త కోణాలు

అనన్య పాండే విచారణతో కేసులో కొత్త కోణాలు

2018 - 19 లో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కొనడం కోసం అనన్య పాండే మూడుసార్లు హెల్ప్ చేసిందని, డ్రగ్స్ డీలర్ల నెంబర్లను వాట్సాప్ చాట్ లో అతనికి షేర్ చేసిందని, అనన్య పాండేకి డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా మరోమారు అనన్య పాండే ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించనున్న నేపథ్యంలో ఈ కేసు మరిన్ని మలుపులు తిరుగుతుందో అన్న ఆసక్తి బాలీవుడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+