వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

drugs case: ఆర్యన్ ఖాన్ కు బొంబాయి హైకోర్టులో రెండోరోజు నో బెయిల్ ; విచారణ రేపటికి వాయిదా!!

|
Google Oneindia TeluguNews

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేయాలని బొంబాయి హైకోర్టులో ఆర్యన్ ఖాన్ తరపున లాయర్లు కేసు వాదిస్తున్నారు. మంగళవారం ప్రారంభమైన ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణ బుధవారం నాడు కూడా హోరాహోరీగా కొనసాగింది. కోర్టు గురువారం కూడా విచారణ కొనసాగించనున్న నేపథ్యంలో, బుధవారం నాడు కూడా ఆర్యన్ ఖాన్ కు బెయిల్ లభించలేదు. జైలు జీవితం నుండి ఆర్యన్ కు ఉపశమనం రాలేదు.

బొంబాయి హైకోర్టులో రెండో రోజు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం వాదనలు

బొంబాయి హైకోర్టులో రెండో రోజు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం వాదనలు


ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు ఇప్పటి వరకు బెయిల్ రాకపోవడంతో మరింత జటిలంగా కనిపిస్తుంది. షారుఖ్ ఖాన్ కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ కేసులో ఆర్యన్ ఖాన్ ను ఏ1 నిందితుడిగా పేర్కొని బెయిల్ ఇస్తే కేసును తారుమారు చేస్తారని, సాక్షులను ప్రభావితం చేస్తారని, ఆర్యన్ ఖాన్ కు అంతర్జాతీయ డ్రగ్స్ గ్యాంగ్ లతో సంబంధాలు ఉన్న కారణంగా బెయిల్ ఇవ్వవద్దని బలంగా వాదిస్తోంది. అయితే ఈ కేసులో యువకులను నిందితులుగా కాకుండా బాధితులుగా చూడాల్సిన అవసరం ఉందని కోర్టు దృష్టికి తీసుకు వెళుతున్న ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాదులు ఆర్యన్ ఖాన్ కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఎన్సీబీ అధికారులు పట్టుకున్న సమయంలో ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని, తను డ్రగ్స్ తీసుకున్న దాఖలాలు కూడా లేవని వైద్య పరీక్షల్లో వెల్లడైందని బలంగా వాదిస్తున్నారు.

ధర్మాసనం ముందు గురువారం ఎన్సీబీ వాదన

ధర్మాసనం ముందు గురువారం ఎన్సీబీ వాదన

డ్రగ్స్ కేసులో రేపు మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత విచారణ కొనసాగనుండగా, నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు ఈరోజు బెయిల్ లభించక పోవటంతో షారూక్ ఖాన్ కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉంది . యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ ఈ కేసులో గురువారం నాడు సమాధానం ఇవ్వనున్నారు. వాదనలు వినిపించటం కోసం తమకు గంట సమయం పడుతుందని సింగ్ చెప్పారు. ఈరోజు నిందితుల తరపున న్యాయవాదులు అమిత్ దేశాయ్, ముకుల్ రోహత్గీ, అలీ కాషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ వాదించారు.

ఆర్యన్ ఖాన్ తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాల బెయిల్ కోసం వాదనలు

ఆర్యన్ ఖాన్ తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాల బెయిల్ కోసం వాదనలు


నిందితుడు అర్బాజ్ మర్చంట్ తరపున హాజరైన అమిత్ దేశాయ్, మొదటి రిమాండ్ సమయంలో ఇది కుట్ర కేసు అని కోర్టు తప్పుదోవ పట్టించిందని అన్నారు. అరెస్టు చేసిన వ్యక్తులకు వారి అరెస్టుకు గల కారణాలను తప్పనిసరిగా తెలియజేయాలని ఆయన అన్నారు. నిందితురాలు మున్ముమ్ ధమేచాకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది దేశ్‌ముఖ్, క్రూయిజ్‌లో సోదాల సమయంలో జరిగిన రికవరీలతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ముగ్గురి బెయిల్ పిటీషన్ లకు సంబంధించిన వాదనలు బుధవారం కోర్టులో జరిగాయి.

Recommended Video

డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయడానికి మరో ప్రజా ఉద్యమం రావాలి!!
అక్టోబర్ 8 వ తేదీ నుండి ఆర్యన్ ఖాన్ జైల్లో .. ఎన్డీపీఎస్ కోర్టు ఆర్యన్ కు బెయిల్ నిరాకరణ

అక్టోబర్ 8 వ తేదీ నుండి ఆర్యన్ ఖాన్ జైల్లో .. ఎన్డీపీఎస్ కోర్టు ఆర్యన్ కు బెయిల్ నిరాకరణ

ఇదిలా ఉంటే ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 8 నుండి జైలులో ఉన్నాడు. అక్టోబర్ 2న ఎన్సీబీ క్రూయిజ్ షిప్ పార్టీపై డ్రగ్స్ దాడుల తర్వాత ఆర్యన్ ఖాన్ ను అరెస్టు చేశారు. ఆర్యన్‌ఖాన్‌కు గత వారం బెయిల్ నిరాకరించిన ప్రత్యేక మాదక ద్రవ్యాల నిరోధక న్యాయస్థానం అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ షూలో దాచిన చరస్ గురించి అతనికి తెలుసునని మరియు ఇది తప్పించుకునేందుకు అతను చేసిన ప్రయత్నం అని ని పేర్కొంది. ఆర్యన్‌తో పాటు, అర్బాజ్ మర్చంట్‌, మున్మున్ ధమేచా మరో 17 మందిని ఈ కేసులో అరెస్టు చేశారు. మంగళవారం ఎన్డీపీఎస్ కోర్టు ఈ కేసులో ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది.

English summary
Bail was not granted even on Wednesday in the Bombay High Court hearing on the bail petition of Aryan Khan in drugs case. Additional Solicitor General Anil Singh will answer thursday on behalf of the NCB. The trial was adjourned till tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X