మద్యం సేవించిన ఎయిర్ ఇండియా పైలట్ షార్జాలో అరెస్ట్
షార్జా: పైలట్ల నిర్లక్ష్య దోరణితో ఇటీవల విమాన ప్రమాదాలు పెరుగుతున్నా.. వారు తమ నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. ప్రయాణికులను సురక్షితంగా చేర్చాల్సిన బాధ్యతను మర్చిపోయి తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎయిర్ ఇండియా పైలట్ మద్యం సేవించి విమానం నడిపేందుకు ప్రయత్నించడం ఆందోళన కలిగించింది.
మద్యం సేవించిన ఎయిర్ ఇండియా విమాన పైలట్‌ను గత శనివారం షార్జాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిర్ ఇండియా విమానాన్ని కొచ్చి మీదుగా ఢిల్లీ తీసుకురావాల్సిన కమాండర్ ఆర్ నంద మద్యం మత్తులో ఉండగా పోలీసులు పట్టుకున్నారు.

టిఓఐ కథనం ప్రకారం.. ఎయిర్‌బస్ ఏ-320 విమానం ఏఐ 934 విమానాన్ని నడిపేందుకు వచ్చిన కమాండర్ నంద మద్యం సేవించి ఉన్నాడని గుర్తించిన సెక్యూరిటీ అధికారులు, ఏఐ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
దీంతో మరో పైలట్‌కు బాధ్యతలు అప్పగించిన ఏఐ, ఆ విమానాన్ని పంపించింది. కాగా, కమాండర్ నందను అదుపులోకి తీసుకున్న అధికారులు, ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications