మందు కొట్టి కారు నడిపిన లేడి లాయర్: ఇద్దరి మృతి
ముంబై: పీకలదాక మద్యం సేవించిన మహిళ న్యాయవాది ఇష్టం వచ్చినట్లు కారు నడపడంతో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన ముంబై నగరంలో జరిగింది. మహిళ న్యాయవాది మద్యం సేవించి కారు నడిపినట్లు విచారణలో అంగీకరించింది.
ముంబై నగరంలో జాహ్నవి గడ్కర్ (35) అనే మహిళ న్యాయవాది నివాసం ఉంటున్నది. ఈమె ప్రసిద్ది చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో వైస్ ప్రెసిడెంట్ (లీగల్ అడ్వజర్)గా పని చేస్తున్నది. సోమవారం రాత్రి జాహ్నవి పీకలదాక మద్యం సేవించింది.
తరువాత అడి క్యూ 3 కారులో ఇంటికి బయలుదేరింది. మార్గం మద్యలో రెండు బైక్ లను డీకొట్టింది. బైక్ లు నడుపుతున్న వారు ఆమె కారును వెంబడించారు. అదే సమయంలో జాహ్నవి కారును వన్ వే లో నడిపింది. ఆ సందర్బంలో ఎదురుగా వస్తున్న ట్యాక్సీని జాహ్నవి కారు డీకొంది.

ఈ ప్రమాదంలో ట్యాక్సీలో వెళుతున్న మహమ్మద్ సయ్యద్ హుస్సేన్ (57), మహమ్మద్ సలీం సాబూవాల (50) అనే ఇద్దరికి తీవ్రగాయాలైనాయి. అదే ట్యాక్సీలో ఉన్న మరొ ముగ్గురికి గాయాలైనాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే మహమ్మద్ సయ్యద్ హుస్సేన్, మహమ్మద్ సలీం సాబూవాల మరణించారని ముంబై నగర డిసీపీ సంగ్రామ్ సింగ్ చెప్పారు. మహిళ న్యాయవాది జాహ్నవిని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలలో జాహ్నవి మద్యం సేవించినట్లు వెల్లడిఅయ్యింది.
జాహ్నవి వన్ వేలో కారు నడపడం వలనే ఇద్దరు మరణించారని, మద్యం సేవించి రాష్ గా కారు నడిపిందని తదితర సెక్షన్ ల కింద కేసు నమోదు చేశామని డీసీపీ సంగ్రామ్ సింగ్ చెప్పారు. ఈ ప్రమాదంలో అడి క్యూ 3 కారు, ట్యాక్సీ ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications