వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుమానాల్లేవు: శ్రీదేవి కేసు క్లోజ్, ఆ 'ఒక్క' ప్రశ్నకే దొరకని సమాధానం, ట్విస్ట్ మీద ట్విస్ట్!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Sridevi Case Closed But Many Unanswered Questions Here ?

దుబాయ్: నటి శ్రీదేవి మృతి కేసును క్లోజ్ చేసినట్లు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ మంగళవారం వెల్లడించింది. మృతదేహానికి ఎంబామింగ్ పూర్తయింది. బంధువులు, భారత్ అధికారులకు అప్పగించారు. దుబాయ్ ఎయిర్ పోర్ట్ నుంచి ముంబై వస్తుంది.

శ్రీదేవి డెత్ మిస్టరీ, ఊహించని ట్విస్ట్‌లు: 'పని చేసుకోనివ్వండి', అసలేం జరిగింది.. బోనీ చుట్టూ ఉచ్చుశ్రీదేవి డెత్ మిస్టరీ, ఊహించని ట్విస్ట్‌లు: 'పని చేసుకోనివ్వండి', అసలేం జరిగింది.. బోనీ చుట్టూ ఉచ్చు

ప్రత్యేక విమానంలో ముంబై తీసుకు వస్తున్నారు. పోలీసులు, ఫోరెన్సిక్ రిపోర్టులలో ఎలాంటి తేడా లేదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో మునిగి చనిపోయినట్లు వెల్లడించారు.

చిక్కుముడులు వీడినట్లే!: ఎట్టకేలకు శ్రీదేవి బాడీ అప్పగింతకు దుబాయ్ ప్రాసిక్యూషన్ ఓకేచిక్కుముడులు వీడినట్లే!: ఎట్టకేలకు శ్రీదేవి బాడీ అప్పగింతకు దుబాయ్ ప్రాసిక్యూషన్ ఓకే

ఎలాంటి అనుమానాలు లేవు

ఎన్నో అనుమానాలు, అపోహలు, ఎన్నో మలుపులు తిరిగిన శ్రీదేవి మృతి కేసులో దర్యాఫ్తు పూర్తయినట్లు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు చెప్పడంతో కేసు ముగిసింది. దర్యాఫ్తు ముగిసిందని, కేసును మూసివేశామని, ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు.

పట్టు కోల్పోయి జారి పడి ఉంటారు

పట్టు కోల్పోయి జారి పడి ఉంటారు

ఆమెకు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత వైద్యులు చేసిన పరీక్షల్లో ఆమె ప్రమాదవశాత్తు నీటిలో పడి ఊపిరాడక చనిపోయారని తేల్చారు. ఆమె దేహంలో అల్కాహాల్‌కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయని, బహుశా స్నానానికి వెళ్లిన ఆమె పట్టును కోల్పోయి కాలు జారి టబ్‌లో పడి ఉంటారని చెప్పారు.

తొలుత అంగీకరించకపోవడంతోనే

తొలుత అంగీకరించకపోవడంతోనే

ఈ క్రమంలో ఆమె ఊపిరి ఆడక చనిపోయారని చెప్పారు. ఈ క్రమంలో బోనీకపూర్‌ను, హోటల్ సిబ్బందిని పోలీసులు విచారించారు. ఆమె మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రాసిక్యూషన్ అధికారులు తొలుత అంగీకరించలేదు. బహుశా ఏవో బలమైన కారణాలే ఆమె చావుకు కారణం అని అందరూ భావించారు.

ఆ ఒక్క ప్రశ్నతో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు

ఆ ఒక్క ప్రశ్నతో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు

దీంతో బాత్ టబ్‌లో ఆమె పడ్డారా, లేక ఎవరైనా తోసేశారా, లేకుంటే బలవన్మరణానికి పాల్పడ్డారా.. అనే ప్రశ్నలు ఉదయించాయి. ప్రాసిక్యూషన్ తొలుత మృతదేహం అప్పగించేందుకు నిరాకరించడంతో ఎన్నో అనుమానాలు, ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు ప్రాసిక్యూషన్ కూడా ప్రమాదమేనని తేల్చింది. అనుమానాలు లేవని నిర్ధారించింది.

శ్రీదేవి మృతిపై అనుమానాలు ఇలా

శ్రీదేవి మృతిపై అనుమానాలు ఇలా

శ్రీదేవిని హత్య చేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఆమెకు మద్యం తాగే అలవాటు లేదని అందరూ చెబుతున్నారు. అలాంటప్పుడు ఆమె రక్తంలో మద్యం ఆనవాళ్లు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. హోటల్లో సీసీటీవీ ఏమయిందని, ఉన్నట్లుండి డాక్టర్లు మీడియా ముందుకు వచ్చి శ్రీదేవి గుండెపోటుతోనే మరణించినట్లు ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. అయితే పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటన వచ్చే వరకు ఆగాలన్నారు.

 బలవంతంగా మద్యం తాగించి

బలవంతంగా మద్యం తాగించి

బాత్‌టబ్‌లో పడి చనిపోవడం అంత సులభం కాదని, ఎవరో ఆమెను బలవంతంగా నీటిలో ముంచితే తప్ప చనిపోలేరని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఆమెతో బలవంతంగా మద్యం తాగించి ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నివేదికతో ప్రమాదమని తేలింది.

ఆ ఒక్క ప్రశ్నే మిగిలి ఉంది?

ఆ ఒక్క ప్రశ్నే మిగిలి ఉంది?

శ్రీదేవి కేసును దుబాయ్ పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు క్లోజ్ చేశారు. అయితే ఒక్క ప్రశ్న మాత్రం మిగిలే ఉందని అంటున్నారు. అసలు, మృతి విషయంలో ఆమె కుటుంబ సభ్యులు తొలుత కార్డియాక్ అరెస్ట్ అని ఎందుకు చెప్పారు? అలా చనిపోయి ఉండవచ్చునని చెప్పారా అనేది తెలియరాలేదు. హడావుడిలో, సరైన సమాచారం లేక చెప్పి ఉంటారని కొందరు భావిస్తున్నారు.

English summary
The Dubai Police have cleared the release of Bollywood icon Sridevi’s body for the embalming process, ending her family’s two-day wait for bringing the body home for cremation. The Dubai Prosecution Service has also closed the investigation into the actor's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X