షాకింగ్ : సిమీ ఉగ్రవాదులు పరారైన రోజు.. 80మంది గార్డులు విధుల్లో లేరు
భోపాల్ : భోపాల్ సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో.. సెంట్రల్ జైలు ఆవరణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లే లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి ఊతమిస్తూ.. ఉగ్రవాదులు పరారైన రోజు ఏకంగా 80మంది గార్డులు సెంట్రల్ జైలు వద్ద విధుల్లో లేకపోవడం గమనార్హం.
ఆ సమయంలో.. వీరంతా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంటివద్ద, జైళ్ల శాఖ మంత్రి కుసుమ్ మెహ్దెలే, మాజీ జైళ్ల శాఖ మంత్రులు, జైళ్ల శాఖ అధికారులు, జైళ్ల హెడ్ క్వార్టర్స్ వద్ద విధుల్లో ఉన్నారట. 3,300మంది నేరస్తులున్న జైల్లో కేవలం 139మంది గార్డులు మాత్రేమే విధుల్లో ఉంటుండడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక జైలు నుంచి తప్పించుకుని దాదాపు 10కి.మీ మేర అక్కడినుంచి పారిపోయిన ఉగ్రవాదులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. కేవలం టూత్ బ్రష్ ల సహాయంతో ఒక డజన్ తాళాలను తయారుచేసుకుని వాటి ద్వారా సెల్ నుంచి బయటకు రావడంలో సక్సెస్ అయ్యారు ఉగ్రవాదులు. అక్కడ ఉన్న ఓ గార్డును కట్టిపడేశారు. అనంతరం ఓ హెడ్ కానిస్టేబుల్ గొంతు కోసి అతడిని చంపేశారు.
ఈ ఎనిమిది మంది నేరస్తులు బంధీలుగా ఉన్న సెల్ వద్ద సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం కూడా వీరికి కలిసొచ్చింది. అదే సమయంలో.. అక్కడ డ్యూటీ చేయాల్సిన నలుగురు సాయుధ గార్డులు సరైన స్థానల్లో లేకపోవడంతో.. తప్పించుకోవడం మరింత సులువైంది. దుప్పట్లు సాయంతో 30అడుగుల గోడను ఎక్కి పరారయ్యారు. ఇంతలో జైలు గేట్ వద్ద ఉన్న ఓ గార్డు రోడ్డు దాటుతున్న నలుగురు వ్యక్తులను చూసి అలారం మోగించడంతో జైలు సిబ్బంది అప్రమత్తమయ్యారు.
అప్పటికే జైలుకు పది కి.మీ దూరంలో ఉన్న ఓ గ్రామం వరకు చేరుకున్న ఉగ్రవాదులను పోలీసులు పట్టుకోగలిగారు. అనంతరం ఎన్ కౌంటర్ లో వారిని మట్టుబెట్టారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications