మోడీ ఉపవాసం గురించి ఆ అధికారి ఏమిచెప్పారు..!

న్యూఢిల్లీ: చైనా ప్రధాని జిన్ పింగ్ భారత్‌కు తన మూడు రోజుల పర్యటనకు వచ్చినప్పుడు గుజరాతీ వంటకాలను వడ్డించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇప్పుడు మోడీ అమెరికా వస్తుండటంతో అక్కడున్న ఎన్నారైలు ఆయనకు గుజరాతీ వంటకాలను వడ్డించేందుకు సిద్దమయ్యారు.

ఐతే ప్రధాని మోడీ తన ఆరు రోజుల అమెరికా పర్యటనలో ఉపవాసం కారణంగా ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం వారందరిని నిరాశకు గురి చేసింది. మోడీ అమెరికాలో ఉండే సమయానికి భారత్‌లో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నాలుగు దశాబ్లాలుగా మోడీ నవరాత్రి ఉపవాసం చేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు లేచి, ధ్యానం, ప్రార్దనలు చేసుకుంటారని మోడీతో గత 12 ఏళ్లుగా అత్యంత సన్నిహతంగా పనిచేస్తున్న అధికారి ఒకరు తెలిపారు.

During US Visit, a Fasting PM Narendra Modi Will Only Have Tea, Lemonade

సెప్టెబర్ 29న మోడీ వైట్‌హౌస్‌లో మోడీ గౌరవార్దం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా డిన్నర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ అధికారిక డిన్నర్(స్టేట్ డిన్నర్) కానప్పటికీ ప్రెసిడెంట్ ఒబామా, ఆయన కేబినెట్ ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ కారణంగా వైట్‌హౌస్‌లో అధికారిక విందును ఏర్పాటు చేయడం లేదు.

అలాగే అమెరికన్ సీఈఓలు అదే రోజు మోడీకి బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేశారు. ఈ రెండు కార్యక్రమాలకు హాజరవనున్న మోడీ, ప్రతిచోటా కేవలం టీ, నిమ్మరసం మాత్రమే తీసుకుంటారని ప్రధాని కార్యాలయ వర్దాలు తెలిపాయి.
భారత్‌లో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు నవరాత్రులు జరగనున్నాయి. ఐతే మోడీ అమెరికా పర్యటనలో భాగంగా 25వ తేదీ సాయంత్రమే అమెరికాకు బయల్దేరి వెళ్లి అక్టోబర్ 1న ఇండియాకు తిరిగి వస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+