వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేశ్యావాటిక తరహాలో దుర్గమ్మ మండపం - సెక్స్ వర్కర్‌ రూపంలో అమ్మోరి విగ్రహం..!!

|
Google Oneindia TeluguNews

కోల్‌కత: దేశం యావత్తూ దసరా పండగ కోలాహలం నెలకొంది. ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ దసరా పండగ సందడి కొనసాగుతోంది. ఏపీలో భవానీ దీక్షలు, తెలంగాణలో బతుకమ్మ సంబరాలు, కర్ణాటకలోని మైసూరులో రాజదర్బార్, గుజరాత్‌లో గర్భ నృత్యాలు, పశ్చిమ బెంగాల్‌లో కాళిక అమ్మవారి మండపాలు.. ఇలా వేర్వేరు చోట్ల వివిధ రూపాల్లో దసరా పండగను జరుపుకొంటోన్నారు ప్రజలు. అక్టోబర్ 5వ తేదీన విజయదశమితో దేవీ శరన్నవరాత్రులు ముగుస్తాయి.

పశ్చిమ బెంగాల్‌లో వైభవంగా..

పశ్చిమ బెంగాల్‌లో వైభవంగా..

పశ్చిమబెంగాల్‌లో దేవీ నవరాత్రులు మరింత ఆకర్షణీయంగా మారాయి. కోల్‌కత దక్షిణేశ్వర్ కాళిక అమ్మవారి ఆలయంలో ఆకాశాన్నంటేలా ఈ పండగను నిర్వహిస్తుందక్కడి ప్రభుత్వం. 1855లో కాళీమాత భక్తురాలు రాణి రష్మోని ఈ ఆలయాన్ని నిర్మించారు. దేశంలో ఉన్న అన్ని కాళీమాత ఆలయాలన్నింట్లోనూ ఇదే అత్యంత ప్రసిద్ధి చెందినది. భక్తులు ఏడాది పొడవునా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. శక్తిపీఠాల్లో ఇదీ ఒకటి. అమ్మవారి కుడి పాదం ఇక్కడ పడిందని విశ్వసిస్తారు. అమ్మవారు రౌద్రరూపంలో కనిపిస్తారిక్కడ.

వీధివీధినా మండపాలు..

వీధివీధినా మండపాలు..

అదే సమయంలో కోల్‌కతలో వీధివీధినా అమ్మవారి మండపాలు వెలిశాయి. హైదరాబాద్‌లో ఏ రకంగా వినాయకుడి మండపాలను వివిధ రూపాల్లో నెలకొల్పుతుంటారో.. కోల్‌కతలో అదే తరహాలో ఏర్పాటు చేశారు భక్తులు. వాటికన్ సిటీ తరహాలో ఓ మండపం వెలిసింది. వాటికన్ సిటీ ఎలా ఉంటుందో.. అచ్చంగా దాన్ని ప్రతిబింబించేలా ఈ మండపాన్ని నెలకొల్పారు. దీన్ని చూడటానికి భక్తులు ఎగబడుతున్నారు.

వేశ్యావాటికను పోలిన విధంగా..

వేశ్యావాటికను పోలిన విధంగా..

మరో మండపం- వేశ్యావాటికను పోలి ఉండేలా తీర్చిదిద్దారు కళాకారులు. అమ్మవారి విగ్రహాన్ని సెక్స్ వర్కర్ రూపంలో చిత్రీకరించారు. నౌపారా దాదాభాయ్ సంఘ్ పూజా కమిటీ దీన్ని ఏర్పాటు చేసింది. ఐడెంటిటీ థీమ్‌తో ఈ మండపాన్ని నెలకొల్పింది. సమాజంలో సెక్స్ వర్కర్ల పట్ల అత్యంత చిన్నచూపు చూస్తుంటారని, అది ఎంత మాత్రం సరైనది కాదని దాదాభాయ్ సంఘ్ పూజా కమిటీ ప్రతినిధులు చెప్పారు.

చిన్నచూపు సరికాదు..

చిన్నచూపు సరికాదు..

సెక్స్ వర్కర్ అనే పేరుతో వారిని సమాజం నుంచి వెలివేసినట్లుగా చూడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ విషయంలో మన ఆలోచన దృక్పథం మారాల్సి ఉందని, సమాజంలో వారికి సమాన హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ ఉద్దేశాన్ని చాటిచెప్పడానికే తాము దుర్గమ్మ అమ్మవారి మండపాన్ని వేశ్యావాటికగా తీర్చిదిద్దామని, సెక్స్ వర్కర్‌ రూపంలో అమ్మవారి విగ్రహాన్ని రూపొందించామని స్పష్టం చేశారు.

ఆ ప్రాంతాల నుంచి తెచ్చిన మట్టితో..

ఆ ప్రాంతాల నుంచి తెచ్చిన మట్టితో..

సెక్స్ వర్కర్లను ఈ సమాజం చులకనగా చూస్తోందని, జీవనోపాధిని కల్పించే వారి వృత్తి ఛీత్కారానికి గురవుతోందని కమిటీ ప్రతినిధులు చెప్పారు. దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని అన్నారు. సెక్స్ వర్కర్లు పెద్ద సంఖ్యలో నివసించే ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టితో బెంగాలీ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు పేర్కొన్నారు. బెంగాలీలో ఈ మట్టిని పుణ్యోమతిగా భావిస్తారని చెప్పారు.

English summary
Durga Puja pandal of Kolkata's Nawpara Dadabhai Sangh Puja Committee in Kolkata comes up with a unique theme 'Parichai'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X