ప్రయాణికులకు రైల్వేశాఖ దసరా కానుక.. నవరాత్రి స్పెషల్ థాలి..
దేశమంతా నవరాత్రి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఇప్పటికే పలు రైళ్లు, బస్సులు ప్రయాణికుల సౌకర్యార్థం స్పెషల్ సర్వీసులను ప్రకటించాయి. ఇక, తాజాగా రైల్వేశాఖ ప్రయాణికులకు దసరా కానుక ప్రకటించింది. ఈ నవరాత్రి పండుగ సీజన్‌లో ప్రయాణికుల ఆహార అలవాట్లను దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ 'నవరాత్రి వ్రత స్పెషల్ థాలి'ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 150కిపైగా రైల్వే స్టేషన్లలో రుచికరమైన వంటకాలను ప్రయాణికులకు అందించనున్నారు. 'నవరాత్రి స్పెషల్ థాలి' భోజనాన్ని ప్రయాణికులు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చునని రైల్వే శాఖ తెలిపింది. ఈమేరకు మంగళవారం ఇండియన్ రైల్వే ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది.

దేశంలోని పలు రైల్వేస్టేషన్లతో పాటు సికింద్రాబాద్, ముంబై వంటి వివిధ స్టేషన్లలో 'నవరాత్రి వ్రత స్పెషల్ థాలి'ని ప్రయాణికులు పొందొచ్చునని రైల్వేశాఖ తెలిపింది. ఈ భోజన తయారీలో నాణ్యత, పోషకాహారం ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని రైల్వే శాఖ అధికార ప్రతినిధి ప్రముఖ మీడియాకు వివరించారు.
నవరాత్రి స్పెషల్ థాలీని పొందాలనుకునేవారు ఐఆర్‌సీటీసీ యాప్, ఈ-క్యాటరింగ్ వెబ్‌సైట్ నుంచి ప్రయాణికులు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణికులు తమ పీఎన్‌ఆర్ నంబర్‌తో ప్రత్యేక భోజనాన్ని ఆర్డర్ చేయవచ్చునని అధికారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications